బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 01, 2020 , 04:13:18

కృష్ణాలంకారం.. నయనానందకరం

కృష్ణాలంకారం..  నయనానందకరం
  • హంసవాహనంపై ఘనంగా ఊరేగింపు

యాదాద్రి నారసింహుడు.. శ్రీకృష్ణాలంకారంలో నయనానందకరంగా భక్తులకు దర్శనమిచ్చాడు. శనివారం రాత్రి స్వామి వారు  మురళీకృష్ణుడి వేషధారణతో హంసవాహనంపై ఊరేగాడు. స్వామివారి అవతార విశేషాలను స్థానాచార్యులు రాఘవాచార్యులు వివరించారు.  శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వైభవాన్ని, శ్రీకృష్ణుడి లీలా విశేషాలు, దివ్యత్వాన్ని ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేదపండితులు భక్తులకు వివరించారు.


యాదాద్రిలో నేడు...

  •  ఆదివారం ఉదయం 11 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ
  • రాత్రి 9 గంటలకు పొన్నవాహనంపై ఊరేగింపు


ఆయుర్వేద వైద్య శిబిరం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ సదన్‌లో బోడుప్పల్‌ అనితా మల్టీస్పెషాలిటీ వైద్యులు డాక్టర్‌ పుల్లయ్య, డాక్టర్‌ రమేశ్‌ల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 10 నుంచి  మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు, స్థానికులకు  వైద్య సేవలు అందించారు. హంసవాహనుడై.. పంచనారసింహుడిని తిరువిధుల్లో హంసవాహనంపై  ఘనంగా ఊరేగించారు.  భక్తులు తన్మయత్వంతో మానస సంచరరే అంటూ నారసింహుడి సేవలో తరించారు. హంసవాహన సేవ ప్రాముఖ్యతను స్థానాచార్యులు క్షుణ్ణంగా వివరించారు. 


సహస్రనామాలు

శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సామూహిక విష్ణు సహస్రనామాల పారాయణం భక్తిపారవశ్యంతో సాగింది. లక్ష్మీనరసింహ కరావలంబ స్ర్తోత్ర పారాయణాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిత్యహవనం, మూలమంత్రం, మూర్తిమంత్ర జపాలు, చతుర్‌స్థానార్చనలు, పంచసూక్త పఠనాన్ని యజ్ఞాచార్యులు, అర్చక బృందం పాంచరాత్ర ఆగమశాస్త్రరీత్యా నిర్వహించారు. 


ఆరాధన

సుప్రభాతంతో మొదలైన స్వామివారి ఆరాధనలు.. శయనోత్సవంతో ముగిశాయి. వేకువజామున బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు హారతి నివేదన, బిందెతీర్థం, బాలభోగం నిర్వహించారు. ఉత్సవమూర్తులకు మంగళస్నానం చేయించి సువర్ణ పుష్పార్చన జరిపారు. 


పారాయణం..

బాలాలయంలో వేదపారాయణం, నిత్యహోమాది పూజలు.. పురాణ ఇతిహాస పారాయణాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్‌.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి,

ఏఈవోలు పాల్గొన్నారు. 


logo
>>>>>>