మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 29, 2020 , 02:48:19

‘మహిళలు సహజ పారిశ్రామికవేత్తలు’

‘మహిళలు సహజ పారిశ్రామికవేత్తలు’
  • ఉమెన్‌ ఫర్‌ గోల్డెన్‌
  • మహిళలకు సత్కారం
  • తెలంగాణ కార్యక్రమంలో
  • పాల్గొన్న మంత్రి సబితారెడ్డి
  • పలు రంగాల్లో రాణించిన

కవాడిగూడ/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళలు సహజ పారిశ్రామికవేత్తలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభివర్ణించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడీఎస్‌ఏ, అలీప్‌(అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌) సంయుక్తంగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలకు హోటల్‌ మారియెట్‌లో శుక్రవారం‘ఉమెన్‌ ఫర్‌ గోల్డెన్‌ తెలంగాణ’ పేరుతో సత్కార కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మల్టీ టాస్కింగ్‌, వ్యవస్థాపక నైపుణ్యాలు మహిళలకు సహజంగానే వస్తాయని కొనియాడారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం వారికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. వారిని మరింతగా ప్రోత్సహించడానికే ఈ సత్కారాలని చెప్పారు. అనంతరం డైరెక్ట్‌ సెల్లింగ్‌ ఉమెన్‌ లీడర్స్‌తో సహా వివిధ రంగాలకు చెందిన 15 మంది మహిళలకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం జగదీశ్వర్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ టి.కె.శ్రీదేవీ, ఐడీఎస్‌ఏ చైర్‌పర్సన్‌రినసన్యాల్‌, ఐడీఎస్‌ఏ వైస్‌ చైర్మన్‌ రజత్‌ బెనర్జీ, అలీప్‌ వ్యవస్థాపకులు రమాదేవి తదితులు పాల్గొన్నారు. 


logo
>>>>>>