గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 29, 2020 , 02:32:31

కారు దిగి..కట్టుకట్టి

కారు దిగి..కట్టుకట్టి
  • బాధితురాలికి ప్రథమ చికిత్స చేసిన రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కీసర/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రమాదానికి గురైన ఓ మహిళలకు ప్రథమ చికిత్స అందిం చి, ఆమెను తన ఎస్కార్ట్‌ వాహనంలో వెంటనే  చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తన ఔదర్యాన్ని ప్రదర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే నాగారం దగ్గరకు రాగానే స్కూటీ, ఆటో ట్రాలీ ప్రమాదానికి గురయ్యాయి. స్కూటీ నడుపుతున్న నల్ల రాణిరెడ్డి అనే మహిళ కిందపడిపోవడంతో చేతులు, కాళ్లకు బలంగా గాయలాయ్యాయి. దీంతో మహేశ్‌భగవత్‌ వెంటనే తన కారును ఆపి ప్రమాదానికి గురై న బాధితురాలి వద్దకు చేరుకొని, ప్రథమ చికిత్స నిర్వహించారు. వెంటనే ఆమెను తన ఎస్కా ర్ట్‌ వాహనంలో విజయ దవాఖానకు తరలించారు. కమిషనర్‌ తన వాహనాన్ని ఆపి ప్రమాదానికి గురైన బాధితురాలిని ఓదార్చి, ప్రథమ చికిత్స చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 


logo
>>>>>>