సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Feb 28, 2020 , 13:08:10

అరటి ఆకులు.. మట్టి గ్లాసులు

అరటి ఆకులు..  మట్టి గ్లాసులు

పెండ్లిలో పర్యావరణహిత వస్తువులు వినియోగించి ఆదర్శంగా నిలిచారు. గురువారం శంషాబాద్‌లోని ఓ కన్వెన్షన్‌లో జరిగిన ప్రశాంత్‌, మానసల వివాహ భోజనాన్ని అరటి ఆకుల్లో వడ్డించారు. మట్టి గ్లాసుల్లో నీళ్లను అందించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు.

ఖైరతాబాద్‌: ప్రజలు స్వచ్ఛందంగా పర్యావరణ హితమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. జీవితంలో ఒక్కసారి జరిగే ప్రధానమైన వివాహతంతును పర్యావరణ హితం గా జరుపుకోవాలన్న సంకల్పంతో వరుడు, వధువు తరపున బంధువులు ప్రతినబూనారు.  గురువారం నగారానికి చెందిన చౌదరి మణిక్యం గుప్తా దంపతుల కుమారుడు ప్రశాం త్‌, చింతల సంగమేశ్వర్‌, వీణా దంపతుల కుమార్తె మానసకు శంషాబాద్‌లోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో సంప్రదాయ మేళాతాళాలు, వేదమంత్రల మధ్య అంగరంగా వైభవం వివాహం జరిగింది.అయితే ఈవివాహతంతు లో ప్రతి వస్తువులు ప్రకృతి సిద్ధంగా లభించినవి వాడటం విశేషం. దానికి గుర్తింపుగా హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఆ నవదంపతులు, వారి కుటుంబ సభ్యులు స్థానం పొందారు. ప్రపంచంలోనే తొలి వివాహమని హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సీఈవో పల్లె సుమన్‌ తెలిపారు. గురువారం సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా నవదంపతులు ప్రశాంత్‌, మానసలు ఈ అరుదైన అవార్డును అందుకున్నారు. 

ఆహ్వాన పత్రికతో మొదలుకొని..

వివాహంలో ప్రధానంగా ఆహ్వాన పత్రిక ఎంతో కీలకం. బంధువులను పిలిచేందుకు పత్రికలు ఇవ్వడం హిందూసంప్రదాయం. అయితే తులసి విత్తనాలతో ఆ వివాహ పత్రికను తయారు చేయడం విశేషం. ఈ విత్తనాలతో తయారు చేసిన పెండ్లి పత్రికలు అందుకున్న వారు వివాహం అనంతరం ఆ పత్రికలను మట్టిలో వేసి నీరు పోస్తే మొక్కలు పెరుగుతాయని చెబుతున్నారు. ఆ సందేహాన్ని పత్రికకు మరో వైపు ముద్రించారు. పెండ్లి పందిరితో పాటు వివాహ భోజనం చేసే టేబుళ్లకు సైతం ఈత, అరటి ఆకులు, పువ్వులతో అలంకరించారు. భోజనం సైతం అరిటాకుల్లో వడ్డించగా, మట్టి గ్లాసులో నీరు, పేపర్‌ కప్‌లలో స్వీటు, ప్రత్యేకంగా బత్తాయి తోలులో ఐస్‌క్రీమ్‌ పెట్టి వడ్డించారు. వివాహ మహోత్సవం ముగిసిన తర్వాత వస్తువు సామాగ్రిని రీసైకిల్‌ యూనిట్‌కు అందిస్తామని పెండ్లి పెద్దలు తెలిపారు.


logo