బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 28, 2020 , 13:02:32

మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత

మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత

ఎర్రగడ్డ, నమస్తే తెలంగాణ : ఎవరైనా బాధలో ఉన్న సమయంలో ఓదార్పు ఎంత ముఖ్యమో.. వాళ్లను ఆదుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి విషయాల్లో డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌ ముందు వరుసలో ఉంటారు. బోరబండలో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వివరాలిలా ఉన్నాయి. ఏడాది క్రితం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమై రోడ్డు పక్క నుంచి నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్న జొన్నగడ్డల రాజయ్య(55) ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. వరద ధాటికి రామారావునగర్‌ నాలాలోకి కొట్టుకుపోయి శవమై తేలాడు. ఈ ఘటన జరిగిన 3 నిమిషాల్లో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ అక్కడికి చేరుకుని బల్దియా సిబ్బందితో కలిసి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. ఆర్థిక సాయమందేలా చేస్తానని హామీ ఇచ్చాడు. తాజాగా ఆ కుటుంబానికి తానిచ్చిన హామీని నెరవేర్చాడు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో మాట్లాడి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన చెక్కును రాజయ్య భార్య జొన్నగడ్డల ఎల్లవ్వకు బాబా ఫసియుద్దీన్‌ గురువారం అందజేశారు. 


logo
>>>>>>