శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 27, 2020 , 02:22:47

మందుబాబులూ.. బీ కేర్‌ఫుల్‌

మందుబాబులూ.. బీ కేర్‌ఫుల్‌
  • తాగి నడిపినందుకు 662 మందికి జైలు
  • 790 డ్రైవింగ్‌ లైసెన్సుల రద్దుకు సిఫారసు
  • 55 రోజుల్లో 4145 మందిపై చార్జిషీటు
  • అత్యధిక బీఏసీ కౌంట్‌ 550

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: యువత మద్యం అతిగా తాగేస్తున్నారు. దీనికితోడు డ్రంకన్‌ డ్రైవింగ్‌ చేస్తూ రోడ్లపై గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఈ ఏడాది రోడ్డ్డు ప్రమాదాల్లో మరణాలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు జనవరి నుంచి ఫిబ్రవరి 24వ తేదీవరకు చేపట్టిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో దాదాపు 4,145 మంది మందుబాబులపై కేసులను నమోదు చేసి వారు నడిపిన వాహనాలు, కార్లు, ఆటోలు, డీసీఎంలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆరు గురు మైనర్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారు. ఈ కేసుల ను నమోదు చేసి చార్జ్జిషీటు దాఖలు చేయడంతో 662 మందికి శిక్ష పడింది.   


అత్యధిక కౌంట్‌ 550

డ్రంకన్‌డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబు ల కౌంట్‌ చూస్తే పోలీసులకే బీపీ పెరిగిపోతుంది. 100మిల్లిలీటర్ల రక్తంలో 35గ్రా ముల మద్యం ఉండాల్సిన మోత్తాదు కొంతమంది మందుబాబుల్లో బ్లడ్‌ అల్కాహాల్‌ కాన్‌సెంట్రేషన్‌ 550కి చేరుకుంటుంది. అంటే అసలు వారు సోయిలేకుండానే రోడ్లపై వాహనాలతో దూసుకుపోతుండడం బెంబేలెత్తిస్తోంది. కౌంట్‌తో పట్టుబడ్డ వారు అల్వా ల్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌, శంషాబాద్‌ పరిధిలో అత్యధికంగా ఉన్నారని తేలింది. 


మద్యం మత్తులో భయం పుట్టిస్తున్న యువత

చాలామంది యువత మద్యం మత్తులో హెల్మెట్‌ పెట్టుకోకుండా, కారులో సీటుబెల్టు పెట్టుకోకుండా వాహనాలను అతివేగంతో నడిపిస్తూ రహదారులపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అతిగా మద్యం సేవించీ ఇక వీరు రోడ్లపై వాహనాలను నడిపించేందుకు అర్హులుకారాని తేల్చి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దాదాపు 790మం ది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేయాలని సిఫార్సు చేశారు. 



ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలి

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని ట్రాఫిక్‌పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా రు. ముఖ్యంగా వాహనాలను ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వారికి నిబంధనలను పాటించమని చెప్పాలని కోరుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే వాహనాలు ఇవ్వొద్దన్నారు. మైనర్లుకు అసలు ఇవ్వొద్దని, వారు దొరికితే యజమానికి జైలు తప్పదని పోలీసులు స్ప ష్టం చేస్తున్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌, అతివేగంతో చేసే డ్రైవింగ్‌ వల్ల కలిగే అనర్థ్ధాలపై ట్రాఫిక్‌ పోలీసులు వివిధ కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. అయినా వారిలో మార్పు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



logo