మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 25, 2020 , 04:59:40

మొక్కలు నాటాలి.. పరిశుభ్రత పెంచాలి

మొక్కలు నాటాలి.. పరిశుభ్రత పెంచాలి
  • పట్టణాలు ప్రగతి పథంలో పయనించాలి
  • ఇబ్రహీంపట్నం పట్టణ ప్రగతిలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

రంగారెడ్డి జిల్లాలో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ పలు ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వెంటనే నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల కమిషనర్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు పట్టణ ప్రగతిలో చురుగ్గా పాల్గొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. 


మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని, పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రతను పెంచాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా  తెలంగాణ ప్రభుత్వం హరితహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా  సోమవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలు వార్డుల్లో పర్యటించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధి లెనిన్‌నగర్‌లోని 33, 34, 35 వార్డుల్లో  విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. తుక్కుగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో పాదయాత్ర నిర్వహించిన మంత్రికి స్థానికులు పలు సమస్యలు వివరించగా నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్‌పల్లి మున్సిపాలిటీలో పర్యటించి పట్టణ ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆమనగల్లు మున్సిపాలిటీలో పాదయాత్ర చేశారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో పర్యటించారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నార్సింగి, మణికొండ, బండ్లగూడ కార్పొరేషన్ల పరిధిలో స్థానిక చైర్మన్లు, మేయర్‌తో కలిసి పాదయాత్ర చేసి పలు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. 


పట్టణ రూపురేఖలు మారుస్తాం : కలెక్టర్‌

   ప్రతి వార్డులో పట్టణ రూపురేఖలు మారుస్తామని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ వెల్లడించారు.  ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. అందుకే పట్టణ ప్రగతి కార్యక్రమంలో సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. వార్డు కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 


పట్టణ ప్రగతిలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఇబ్రహీంపట్నంలో మున్సిపాలిటీలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, జిల్లా అడిషనల్‌ కలెక్టర్లు డాక్టర్‌ హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌లతో కలిసి ప్రారంభించారు.


logo
>>>>>>