శనివారం 28 మార్చి 2020
Hyderabad - Feb 25, 2020 , 04:57:17

ఆకట్టుకునేలా.. ఠాణా

ఆకట్టుకునేలా.. ఠాణా
  • పిల్లలకు ఆహ్లాదం పంచే వాతావరణం
  • స్టేషన్‌లో ఆటస్థలం..గ్రంథాలయం
  • మేడిపల్లిలో తొలిసారిగా చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌
  • బాలల హక్కుల సంరక్షణ..

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్రంలోని బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తుంది. అదే విధంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు వారితో కలిసి తెలంగాణ రాష్ర్టాన్ని బాలలకు స్నేహ పూర్వక వాతవరణం కల్పించే విధంగా కృషి చేయడం అభినందనీయం.   

- పొనుగోటి అంజన్‌రావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు


మేడిపల్లి: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు చైల్డ్‌ ప్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు.  పభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అత్యాధునిక హంగులతో మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.  ఈ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన పిల్లల రక్షణ, సంరక్షణతో పాటు నేరారోపణ గల చిన్నారుల కోసం స్టేషన్‌లో ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఇప్పటికే పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ సంస్థతో కలిసి పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లోని మొదటి అంతస్తులో చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. వివిధ కేసుల్లో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారి పిల్లలు స్టేషన్‌లో ఆడుకోవడానికి ఆట వస్తువులు, బొమ్మలు, గ్రంథాలయం ఏర్పాటు, అదే విధంగా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కును సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లను చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌లుగా మార్చనున్నారు.


పిల్లలకు భయం లేకుండా..

 రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే పిల్లలకు ఆటస్థలం, లైబ్రరీ ఉండటంతో ఎలాంటి భయానికి లోను కాకుండా ఉంటున్నారు. 

- అంజిరెడ్డి, సీఐ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌             


బాలల హక్కుల సంరక్షణ..

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్రంలోని బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తుంది. అదే విధంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు వారితో కలిసి తెలంగాణ రాష్ర్టాన్ని బాలలకు స్నేహ పూర్వక వాతవరణం కల్పించే విధంగా కృషి చేయడం అభినందనీయం.   

- పొనుగోటి అంజన్‌రావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు


 స్నేహ పూర్వక పోలీస్‌ స్టేషన్లు 

పిల్లలు వివిధ కారణాలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పుడు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ న్యాయ సహాయం  అందించడంతో పాటు వారికి రక్షణ కల్పించేందుకు ఈ బాలల స్నేహ పూర్వక పోలీస్టేషన్లు కృషి చేస్తాయి. బచ్‌పన్‌ బచావో సంస్థ పోలీస్‌ శాఖతో పాటు పిల్లలతో పనిచేసే వివిధ శాఖలతో సమస్వయం చేస్తూ పిల్లలందరికి స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నది.    

 -అందె వెంకటేశ్వర్లు, రాష్ట్ర  బచపన్‌ బచావో సమన్వయ కర్త


logo