మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 25, 2020 , 04:41:05

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టిక్‌ నియంత్రణకు చర్యలు..!

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టిక్‌ నియంత్రణకు చర్యలు..!
  • నాలాల వద్ద ఫ్లోటింగ్‌ ట్రాష్‌ బారియర్‌ వినియోగం
  • తొలుత బల్కాపూర్‌ నాలా సంగమం వద్ద ఏర్పాటు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చారిత్రక హుస్సేన్‌సాగర్‌ శుద్ధికి హెచ్‌ఎండీఏ అవసరమైన అన్ని చర్యలు  తీసుకుంటున్నది. ఎగువ ప్రాంతాల నుంచి సాగర్‌లోకి చుక్కా మురుగునీరు, ఇతర చెత్తా,వ్యర్థాలు రాకుండా ఆధునిక యంత్రాలు ఎక్సావేటర్‌, ట్రాష్‌ కలెక్టర్‌, డ్రెజ్జింగ్‌ యుటిలిటీ క్రాప్టు(డీయూసీ) యంత్రాలతో పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సాగర్‌ వైపు వచ్చే ప్రధాన నాలాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సరస్సులోకి చెత్త ప్రవేశించకుండా ఉండడానికి ముందస్తుగా బల్కాపూర్‌ నాలా సంగమం వద్ద ఫ్లోటింగ్‌ ట్రాష్‌ బారియర్‌ను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేస్తున్నది. సాగర్‌లోకి ప్లాస్టిక్స్‌, ఇతర చెత్త రాకుండా పూర్తిస్థాయిలో నియంత్రించడమే లక్ష్యంగా ఈ ఫ్టోటింగ్‌ ట్రాష్‌ బారియర్‌ను వినియోగించనున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో నాలాల ద్వారా వరద నీటితోపాటు ప్లాస్టిక్‌, చెత్త సాగర్‌లోకి వ చ్చి చేరుతుండడం, ఫలితంగా ఏడాది పొడవునా సర స్సు కలుషితంగా మారుతుండడంతో సరస్సు ఎగువ భాగంలోనే కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నారు.

     హుస్సేన్‌సాగర్‌ 14.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ సరస్సు చుట్టూ పికెట్‌నాలా, కూకట్‌పల్లి, ఫత్తేనగర్‌, ప్రకాశ్‌నగర్‌, పికెట్‌, బల్కాపూర్‌ నాలాల ద్వారా 400ఎంఎల్‌డీ మేర ప్రవాహం ఉం టుంది. ఇందులో 360 ఎంఎల్‌డీల మేర శుద్ధిచేసి అం బర్‌పేట వైపు మళ్లిస్తున్నారు. దాదాపు 40 ఎంఎల్‌డీ మేర మురుగునీరు శుద్ధికాకుండానే నేరుగా వచ్చి చేరుతున్నది. ఈ మురుగునీటిని శుద్ధిచేసి శాశ్వతంగా మళ్లించేందుకు ఐ అండ్‌ డీ నిర్మాణం చేపడుతున్నది. ఐతే వర్షాకాలం వరద తాకిడి విపరీతంగా ఉండడంతో ఎగువ ప్రాంతాల నుంచి పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సరస్సులోకి వచ్చి చేరుతున్నాయి. తొలి విడుతగా బల్కాపూర్‌ నాలా సంగమం పాయింట్‌ను ఎం పిక చేసిన అధికారులు ఫ్లోటింగ్‌ ట్రాష్‌ బారియర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లోటింగ్‌ ట్రాష్‌ బారియర్‌ అడ్డంకులు తొలగించేందుకు స్క్రీనింగ్‌ మెషిన్‌లాగా పనిచేస్తుందని, ప్లాస్టిక్‌, పాలిథిన్‌ కవర్లు, ఇతర వ్యర్థా లు సరుస్సులోకి రాకుండా ముందే ఫిల్టర్‌ చేస్తాయని, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అధికారులు పేర్కొన్నారు. 


logo
>>>>>>