బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 22, 2020 , 03:28:56

విదేశీ విద్యకు భరోసా..

 విదేశీ విద్యకు భరోసా..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విదేశాల్లో చదువుకోవడం.. కుదిరితే ప్లేస్‌మెంట్‌ కింద అక్కడే ఉద్యోగం, ఇంకా పరిస్థితులు అనుకూలిస్తే అక్కడే స్థిరపడటం. ఇది సగటు విద్యార్థి ఆలోచన.. కానీ డాలర్లు, పౌండ్లు ఖర్చుచేయాలంటే వెనుకాడతారు. ఇలాంటి యువతకు భరోసానిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, కావాల్సిన ధ్రువపత్రాలను సమర్పిస్తే సరి. ఏకంగా రూ. 20 లక్షలను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్నిస్తున్న సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్స్‌ మైనార్టీ సంక్షేమశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా, మార్చి12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశావహులు www. telangana epass. cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం 040 -23240134 నంబర్‌ను సంప్రదించవచ్చు.

  అర్హులు.. వీళ్లే

ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్సీలు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయదలిచిన అభ్యర్థులు డిగ్రీ, ఇంజినీరింగ్‌లలో  60 శాతం మార్కులు పొంది ఉండాలి. పీహెచ్‌డీ చేయదలిచిన వారు పీజీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. లబ్ధి పొందగలిగే వారు  ఆగస్టు 2019 నుంచి డిసెంబర్‌ 2019 వరకు ఎంపిక చేయబడిన విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొంది ఉండాలి. 

l ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత ఆయా దరఖాస్తును జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలి. ఇలా సమర్పించని పక్షంలో ఆయా దరఖాస్తులను పరిశీలించరు. దీని వల్ల తిరస్కరణకు గురయ్యే ప్రమాదమున్నది.

 ఈ కోర్సుల్లో చేరవచ్చు..

l ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, స్వచ్ఛ సైన్స్‌, వ్యవసాయసైన్స్‌, మెడిసిన్‌, నర్సింగ్‌, సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సుల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. 

ఈ దేశాల్లో చదువొచ్చు..

l అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌కింగ్‌డమ్‌, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో చదువుకోవచ్చు. logo
>>>>>>