శనివారం 28 మార్చి 2020
Hyderabad - Feb 22, 2020 , 03:24:22

ప్రభుత్వ పథకాలపై ప్రచారం

ప్రభుత్వ పథకాలపై ప్రచారం

కీసర : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీసరగుట్టలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాటు చేయడం అభినందనీయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం మహశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న పథకాలు, ఆ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఈ స్టాల్స్‌లో దొరుకుతుందని అన్నారు. భక్తులకు జాతరలో సమాచారం అందించడం హర్షనీయమని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారుల పనితీరును ప్రశంసించారు.


logo