సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 22, 2020 , 03:22:21

150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

 150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఘట్‌కేసర్‌ : అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని  ఘట్‌కేసర్‌ పోలీసులు పట్టుకున్నారు. 150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు.  సీఐ రఘువీర్‌ రెడ్డి  కథనం ప్రకారం..  మహారాష్ట్రకు చెందిన లారీ (ఎంహెచ్‌ 12 హెచ్‌డీ 7318) బియ్యం లోడ్‌తో వెళుతూ..  చౌదరిగూడ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల రోడ్డులో ఆగింది. అదే సమ యంలో మొబైల్‌ వ్యాన్‌ వచ్చింది. సిబ్బంది  శ్రీనివాస్‌, అబ్బాస అలీ, నవీన్‌లు లారీని బియ్యం లోడ్‌గా గుర్తించారు. లారీలో ఉన్నవారిని విచా రించగా రేషన్‌ బియ్యం అని తేలింది. వెంటనే లారీలో ఉన్న ఎండి జమీర్‌, ఎస్‌డి వాసీంవహీద్‌లను అరెస్ట్‌చేసి.. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


logo