మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 22, 2020 , 03:21:07

ఉద్యోగంలోంచి తీసేశారని కక్ష..

ఉద్యోగంలోంచి తీసేశారని కక్ష..

మన్సూరాబాద్‌ : గతంలో పని చేసిన సంస్థకు కన్నం పెట్టి.. లక్షలు కాజేసిన వ్యక్తితో పాటు సహకరించిన మరో ముగ్గురిని ఎల్బీనగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశా రు. నిందితుల నుంచి రూ. 9.51 లక్షల నగదు,  ఐ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నా రు. ఎల్బీనగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్స్‌ డీసీపీ యాదగిరి వివరాలు వెల్లడించారు.  కవాడిగూడ, ముగ్గుబస్తీకి చెందిన అన్నారం మల్లికార్జున్‌ (24) ఎల్బీనగర్‌, సీరిస్‌రోడ్డులోని నిక్కో లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో క్లస్టర్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. అయితే సంస్థలో అవకతవకలకు పాల్పడటంతో మల్లికార్జున్‌ను 15 రోజుల క్రితం ఉద్యోగం నుంచి తొలగించా రు. దీంతో మల్లికార్జున్‌ ఆ సంస్థపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆఫీస్‌ లాకర్‌లో  నగదును కాజేయాలని పథకం వేసుకున్నాడు. ఇందుకు బావమరిది  రాణిగంజ్‌, విక్టోరియాకు చెందిన డ్రైవర్‌ రుమాల రాకేశ్‌ (22)ను కలుపుకున్నాడు. కాగా... ఉద్యోగం చేసే సమయంలో  మల్లికార్జున్‌ వద్ద గోడౌన్‌ తాళాలు ఉండగా.. వాటిని, కొత్త ఫోన్‌ను బావమరిదికి ఇచ్చాడు. ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసి రమేశ్‌ను నిక్కో లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయం వద్దకు పంపాడు. మల్లికార్జున్‌ బయట ఉండి.. వాట్సాప్‌ కాల్‌ ద్వారా రమేశ్‌కు సూచనలు ఇవ్వగా.. అతను బీరువాలో ఉన్న  రూ. 13 లక్షలను అపహరించాడు.  బయటకు వెళ్లేటప్పుడు సంస్థ గోడౌన్‌లో ఉన్న సీసీ కెమెరాతో పాటు డీవీఆర్‌ను తీసుకువెళ్లి..  కవాడిగూడలోని ఓ నాలాలో వేశారు. దొంగలించిన రూ. 13 లక్షల్లో కొన్ని చిన్న నోట్లు (రూ. 10, రూ. 20, రూ. 50) ఉండగా.. వాటిని పెద్ద నోట్లుగా మార్చేందు కు ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌ మక్తాకు చెందిన మహ్మద్‌ అస్లామ్‌ (21), అబ్దుల్‌ నదీమ్‌ ఖురేషీకు అప్పగించారు.  

   కాగా.. నిక్కో లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ లాకర్‌లోని డబ్బును అపహరించిన విషయంపై సంస్థ యజమాని శ్రీకాంత్‌ ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా..  దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిక్కో లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో దొంగతనం విషయం బయటపడింది. దొంగలించిన రూ. 13లక్షల్లో రూ. 2 లక్షలు చిరిగిన నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో రూ. 1.50 లక్షలతో నిందితులు ఖరీదైన ఐ ఫోన్‌ను కొనుగోలు చేయడమే కాకుండా జల్సాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులైన  మల్లికార్జున్‌,  రాకేశ్‌, మహ్మద్‌ అస్లాం, అబ్ధుల్‌ నదీమ్‌ ఖురేష్‌లను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.  సమావేశంలో ఎల్బీనగర్‌ ఏసీపీ పృథ్వీధర్‌రావు, సీఐ అశోక్‌రెడ్డి, డీఐ కృష్ణమోహన్‌ పాల్గొన్నారు. logo
>>>>>>