గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 22, 2020 , 03:18:45

ఆకట్టుకున్న పోలీస్‌ బ్యాండ్‌ ప్రదర్శన

ఆకట్టుకున్న పోలీస్‌ బ్యాండ్‌ ప్రదర్శన

చార్మినార్‌/బన్సీలాల్‌పేట్‌: జాతీయస్థాయిలో నిర్వహించే రైల్వే పోలీస్‌ సమ్మిట్‌ లో భాగంగా శుక్రవారం రాత్రి దక్షిణ మండల రైల్వే పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసుల బృందం సభ్యులు చారిత్రక చార్మినార్‌ వద్ద తమ బ్యాండ్‌ ప్రదర్శన నిర్వహించారు. త్వరలో జాతీయ స్థాయిలో నిర్వహించే 20వ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బ్యాండ్‌ పోటీల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యర్థులకు గట్టిపోటీనివ్వనుందని దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. పోటీల్లో భాగంగా నగరంలోని చారి త్రక ప్రదేశాల వద్ద బ్యాండ్‌ సభ్యులతో ప్రత్యేకంగా ప్రదర్శన నిర్వహిస్తూ ప్రజల మద్దతును కూడ గట్టుకుంటున్నామని తెలిపారు. ప్రజల్లోనూ రైల్వే బ్యాండ్‌ పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో చార్మినార్‌ ఏసీపీ అంజయ్యతో పాటు దక్షిణ మధ్య రైల్వే విభాగం అధికారులు పాల్గొ న్నారు. దక్షిణ మధ్యరైల్వే జట్టు విజయం సాధించే విధంగా నగర ప్రజలు మద్దతు పలకాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరుతున్నారు.

 అలాగే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని బోయిగూడ మార్గం వైపు మహారాష్ట్ర పోలీస్‌ బ్యాండ్‌, ఆర్‌పీఎఫ్‌ బ్యాండ్‌ కళాకారులు నిర్వహించిన ప్రదర్శన అం దరిని అలరించింది. బ్యాగ్‌పైపర్‌ బ్యాండ్‌లో అరగంట సేపు లయబద్దంగా ఆడు తూ నిర్వహించిన ప్రదర్శనను ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ఆర్‌పీఎఫ్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ జతిన్‌రాజ్‌, సహాయ సెక్యూరిటీ కమిషనర్‌ ఉజ్జల్‌దాస్‌, ఇన్‌స్పెక్టర్‌ బెన్నయ్య, ఇతర అధికారులు, రైల్వే ప్రయాణికులు, సాధారణ ప్రజలు, అధికారుల సమక్షంలో నిర్వహించిన సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది


logo