మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 21, 2020 , 03:52:09

ఘనంగా మాతృభాషా దినోత్సవం

ఘనంగా మాతృభాషా దినోత్సవం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మాతృభాషను రక్షించుకోవడం అంటే.. ఆ జాతి మూలా లను కాపాడుకోవడమే అవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ డాక్టర్‌ నందిని సిధారెడ్డి అన్నారు. ఈ నెల 21వ తేదీన ‘ప్రపంచ మాతృభాషా దినోత్సవం’. అయితే, 21న మహా శివరాత్రి పర్వదినం కావడంతో ముందస్తుగా గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి తెలుగు సాహితీలోకంలో అగ్రగణ్యులైన ఏడుగురు సాహితీవేత్తలను తెలంగాణ సాహిత్య అకాడమి ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ‘మాతృభాషా దినోత్సవం’పై చర్చావేదిక, ఇష్టాగోష్టి కార్యక్రమాలను నిర్వహించింది. మన తెలుగు భాషను మాతృభాషగా ఉన్న రెండు రాష్ర్టాలలో ఒకటైన తెలంగాణ - సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. తెలుగు భాషా ఉన్నతికి, అభివృద్ధికి పాటుపడిన ఎందరో సాహితీవేత్తలను, భాషా పిపాసులను ఈ సం దర్భంగా మననం చేసుకొని వారికి పెద్ద ఎత్తున నివాళులర్పించారు. 


కార్యక్రమంలో పలువురు ఆచార్యులు, ప్రొఫెసర్లు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు ఎంతో మంది పాల్గొన్నారు. పైన పేర్కొన్న ఏడుగురు సాహితీవేత్తలలో ప్రధానంగా ‘ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, పాలకుర్తి మధుసూదన్‌ రావు, ఆచార్య ఎస్వీ రామారావు, జీ రామశర్మ’లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మనిషి పుట్టుక తరువాత ప్రప్రథమంగా నేర్చుకునే భాషను మాతృభాషగా ఆయన అభివర్ణించారు.  తెలుగు భాషకు తెలంగాణ సాహిత్య అకాడమి చేస్తున్న సేవలను పాలకుర్తి మధుసూదనరావు కొనియాడారు. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు సృజ నాత్మక పోటీలు నిర్వహిస్తే తెలుగు భాష బతుకుతుందని సూచించారు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ, తెలంగాణలో ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆ కేంద్రంలో రావాల్సిన ఉండాల్సిన విభాగాలను సూచించారు. పాఠ్య పుస్తకాల తయారీ కోసం తెలుగు అకాడమి ప్రత్యేకంగా పని చేస్తున్నట్టుగా తెలంగాణ భాష, సాహిత్యాల కోసం ఒక పరిశోధన కేంద్రం ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు.  సాహితీవేత్తలంతా తెలుగు భాషాభివృద్ధికి పలు సూచనలు చేశారు. 


logo
>>>>>>