ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Feb 19, 2020 , 00:27:23

‘నమస్తే’ ఉద్యోగులకు మ్యాక్సివిజన్‌ ఉచిత కంటి పరీక్షలు

‘నమస్తే’ ఉద్యోగులకు మ్యాక్సివిజన్‌ ఉచిత కంటి పరీక్షలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  మ్యాక్సివిజన్‌ దవాఖాన  ఆధ్వర్యంలో  మంగళవారం బంజారాహిల్స్‌లోని  ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన కార్యాలయంలో  ఉద్యోగులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 300 మంది ఉద్యోగులకు కంటిపరీక్షలు నిర్వహించి, వారి కుటుంబాలకు కూడా దవాఖానలో ఉచిత కంటి పరీక్షలకు అవకాశం కల్పించారు.  10 శాతం వైద్య ఖర్చులు తక్కువగా తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. యజమాన్యం కాసు ప్రవీణ్‌ రెడ్డి సూచనల మేరకు  ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని వైద్యులు తెలిపారు. కంటి పరీక్షల్లో  ‘నమస్తే తెలంగాణ’  ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి, వైస్‌ప్రెసిడెంట్‌ వీఎస్‌.రామారావు, చీఫ్‌ ఆఫ్‌ న్యూస్‌ బ్యూరోస్‌ ఓరుగంటి సతీష్‌, స్టేట్‌ బ్యూరో ఇన్‌చార్జి ఎక్కల్‌దేవి శ్రీనివాస్‌, ప్రకటనల విభాగం జనరల్‌ మేనేజర్‌ రవీంద్రనాథ్‌, అసిస్టెంట్‌ జీఎం శ్రీకాంత్‌, సర్కులేషన్‌ డీజీఎం రాంరెడ్డి, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మధుసుదన్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. మహ్మద్‌ షహీద్‌, పృథ్వీరాజ్‌, అరుణ్‌, సంతోష్‌, నవీన్‌ కుమార్‌, సంతోష్‌ సింగ్‌ మ్యాక్సివిజన్‌ సిబ్బంది ఉద్యోగులకు కంటిపరీక్షలు నిర్వహించారు. 


logo