బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 18, 2020 , 02:26:36

హరిత హారతి

హరిత హారతి

రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలని సంకల్పించిన జన హృదయనేతకు యావత్‌ ప్రజానీకం నిండు మనసుతో శుభాకాంక్షలు తెలిపింది. కోటి కాంతుల చిరునవ్వుతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించింది. కారణజన్ముడికి పుట్టిన రోజున ‘పచ్చని’ కానుక అందించింది.

  • పండుగలా సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు
  • తెలంగాణ జాతిపితకు హృదయపూర్వక దీవెనలు
  • నగరవ్యాప్తంగా శోభాయమానంగా ‘హరితహారం’

రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలని సంకల్పించిన జన హృదయనేతకు యావత్‌ ప్రజానీకం నిండు మనసుతో శుభాకాంక్షలు తెలిపింది. కోటి కాంతుల చిరునవ్వుతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించింది. కారణజన్ముడికి పుట్టిన రోజున ‘పచ్చని’ కానుక అందించింది. నగరవ్యాప్తంగా సోమవారం సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. ప్రగతి ప్రదాత స్ఫూర్తితో ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అన్నదానం, రక్తదానం,  ఉచిత వైద్య శిబిరాలు, దేవాలయాల్లో పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. జయహో అపర భగీరథుడా... జయహో అంటూ కీర్తించారు. బంగారు తెలంగాణ స్వప్నం సాకారానికి తోడ్పాటునందిస్తామంటూ... ప్రతినబూనారు. 


సిటీబ్యూరో/ఖైరతాబాద్‌: అపర భగీరథుడు, పేదల జీవితాల్లో వెలుగులు నింపిన తెలంగాణ జాతిపితకు యావత్‌ ప్రజానీకం హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, నగరవాసులు సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. జనహృదయనేతకు పర్యావరణంపై ఉన్న మమకారాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటి ఆయనకు కానుకగా ఇచ్చారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కళాకారుల కోలాటం, బతుకమ్మలు, ఒగ్గుడోలు, పులివేషధారణలు, గుస్సాడి, కొమ్ము కోయ, యక్షగానం తదితర వేషధారణలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.  


సీఎం కేసీఆర్‌ జీవిత నేపథ్యాన్ని వివరిస్తూ.. ఫొటో ఎగ్జిబిషన్‌, ప్రభుత్వం ఆమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంపీలు కే. కేశవరావు, సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి , మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. స్పీకర్‌ పోచారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీఎం కేసీఆర్‌ జీవిత నేపథ్యాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ప్రారంభించారు. దివ్యాంగులకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ వీల్‌చైర్లను పంపిణీ చేశారు. 66 కిలోల భారీ కేక్‌ను రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు కట్‌ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసనమండలి చీఫ్‌ విప్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌ తదితర ప్రముఖులను మంత్రి తలసాని శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.


 ఈ సందర్భంగా సుమారు 10వేల మందికి భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంఎన్‌ శ్రీనివాసరావు, బీఎన్‌ రెడ్డి,  సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, కార్పొరేటర్లు, నాయకులు పవన్‌కుమార్‌ గౌడ్‌, కరుణాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో కలిసి బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని డివైడర్‌లో మొక్కలను నాటారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. logo