శనివారం 30 మే 2020
Hyderabad - Feb 15, 2020 , 12:14:34

బూజుతో జర భద్రం..!

బూజుతో జర భద్రం..!

తార్నాక: బూజు పట్టిన ఆహారాన్ని తీసుకోకండి... అది ప్రాణాంతకం కావొచ్చు. ఎందుకంటే... 1975లో రాజస్థాన్‌లో వాతావరణంలో వచ్చిన మార్పులు అక్కడి ఆహార పదార్థాలపై ప్రభావం పడింది. అక్కడ జొన్నరొట్టెలను ఆహారంగా తీసుకున్న వారు... సరిగ్గా నెల రోజుల తర్వాత అక్కడి ప్రజలు ఏదో తెలియని వ్యాధికి గురయ్యారు. చిన్నా, పెద్దా అనే తారతమ్యం లేకుండా సుమారు 400 మంది వ్యాధి భారీనపడ్డారు. వీరిలో 100 మంది మృత్యువాతపడ్డారు. దీనిపై జాతీయ ఆహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) చేసిన పరిశోధనల్లో ఒక భయాంకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే అక్కడ పండించిన మొక్కజొన్న పూర్తిగా తడిసిముైద్దె బూజు పట్టింది. దానిని ఆహారంగా తీసుకోవడంతో అందులో నుంచి వెలువడిన విషపదార్థం ప్రాణాంతకమైంది. ఇదే తరహాలో 1981లో ఆఫ్రికాలో  12 మంది, 2004లో అదే దేశంలో మరో 100 మందికిపైగా కాలేయంతో పాటు క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యారు.  


మనం ఇంట్లో వాడే ఆహార పదార్థాల్లో... 

మనం ఇంట్లో వాడే ఆహార పదార్థాల్లో, పచ్చళ్లతో పాటు ఇతర వాటిలో ఒక్కోసారి బూజు పడుతుంది. అలాంటి సమయంలో కొంతమంది దానిని తొలగించి తిరిగి అవే పదార్థాలను ఆహారంగా తీసుకుంటారు. ఇది అప్పటి వరకు బాగానే ఉన్నా, నిరంతరం కొనసాగితే కొంతమేరకు ఆరోగ్యానికి హానికరమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్లాటాక్సిస్‌, మైకోటాక్సిస్‌, క్రానిక్‌ టాక్సిస్‌ వంటి బూజులో రకాలు. వీటిలో ఏ ఒక్కటి అయినా మనం తీసుకునే ఆహారంలో కలుషితమైతే అనారోగ్యాలకు దారితీస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో),ఆహార భద్రత, ప్రమాణాల విభాగం(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) వంటి సంస్థల ఆధారంగా వెలుగులోకి వచ్చిన అనేక అంశాలపై 1960 నుంచి బూజు వంటి విష పదార్థాలపై విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో 1 కిలోకి 1వ వంతు బూజు ఉందని వివిధ పరీక్షల్లో రుజువైతే.. దాని ద్వారా 15 మైక్రోగ్రాముల విష రసాయన శక్తి వస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇక గోడౌన్‌ల్లో ఆహార పదార్థాలను నిలువ చేసే సమయంలో అక్కడి వాతావరణ పరిస్థితులు, ఇతర రక్షణ చర్యలతో పాటు సకాలంలో స్పందించి, వాటిలో బూజు శాతాన్ని లెక్కించాలి. పరిమితికి మించి ఉంటే దానిని వెంటనే తొలగించాలి.


ఎన్‌ఐఎన్‌లో విశిష్ట పరిశోధనలు..

జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లో ఆహార పదార్థాల రక్షణ విభాగం (ఫుడ్‌సేప్టీ) ఆధ్వర్యంలో దేశ నలుమూలలో నిల్వ ఉన్న ధాన్యాలతో పాటు తయారు చేయబడిన ఆహార పదార్థాలు (రెడీ టు ఈట్‌)లపై నిరంతరం పరిశోధనలు కొనసాగుతున్నాయి. చాలా రోజుల వరకు ఆహార పదార్థాలను విచ్చలవిడిగా అమర్చితే అందులో బూజు శాతం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని సమయాల్లో బూజుపట్టిన ఆహార పదార్థాలు ఊరికే వదిలేయకుండా తిరిగి వాటిని ఇతర పద్ధ్దతుల్లో మార్పులు చేసుకొని ఆహారంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారని,  ఇది ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 


logo