మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 16, 2020 , 03:47:41

మూగ జీవాలకు ‘యాంటీ రేబిస్‌' వేయించాలి

మూగ జీవాలకు ‘యాంటీ రేబిస్‌' వేయించాలి
  • పశు వైద్య సంచాలకులు డాక్టర్‌ లక్ష్మారెడ్డి

అహ్మద్‌నగర్‌ : పెంపుడు జీవాలైన కుక్కలు, పిల్లుల్లో వృద్ధి చెందే రేబిస్‌ ప్రాణాంతకరమైనదని, ఈ జీవాలతో గాయపడ్డ వారికి ప్రాణాపాయం కలిగే అవకాశాలుంటాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్‌ వి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం విజయనగర్‌ కాలనీ శాంతినగర్‌ వెటర్నరీ దవాఖానలో ఇండో అమెరికన్‌ వెటర్నరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పెంపుడు జీవాలకు ఉచిత వ్యాక్సినేషన్‌ క్యాంప్‌ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేబిస్‌ వ్యాధి సోకిన వారికి చికిత్స ఉండదని, అందుకే తమ పెంపుడు జీవాలకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లు విధిగా వేయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.రాంచందర్‌, హైదరాబాద్‌ జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ పరమేశ్వర్‌రెడ్డి, శాంతినగర్‌ వెటర్నరీ దవాఖాన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మధుసూదన్‌, అసోసియేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ చంద్రావతి, సిబ్బంది ప్రకాశ్‌, కృష్ణవేణి, జానకి తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌ పశువైద్య కళాశాల విద్యార్థులు అజయ్‌ వర్మ, యోగేశ్‌, శిరీష పాల్గొని సేవలందించారు. 


logo
>>>>>>