శనివారం 30 మే 2020
Hyderabad - Feb 15, 2020 , 02:08:16

రహదారులపై పడకుండా.. దుర్వాసన రాకుండా..

రహదారులపై పడకుండా.. దుర్వాసన రాకుండా..
  • వ్యర్థాల తరలింపునకు కంటెయినర్లు
  • ప్రయోగాత్మకంగా రెండు చోట్ల ఏర్పాటు
  • దశల వారీగా 150 ప్రాంతాలకు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చెత్త రోడ్లపై పడకుం డా, దుర్వాసన రాకుండా కంటెయినర్లలో తరలించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా రెం డు ప్రాంతాల్లో వచ్చే వారంరోజుల్లోనే ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. కంటెయినర్లను ఏర్పాటుచేసేందుకు ఇప్పటికే 95జాగాలను ఎంపిక చేశారు. దశలవారీగా 95 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. అనంతరం 150 ప్రాంతాలకు విస్తరించే ప్రతిపాదన ఉంది. ఇవి ఏర్పాటైతే చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లతో పని ఉండదు.


మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు

2016ప్రకారం చెత్తను ఓపెన్‌ టిప్పర్లలో కాకుండా పూ ర్తిగా మూసివున్న వాహనాల్లోనే తరలించాల్సి ఉంది. అంటే, ఎక్కడా వ్యర్థాల ద్వారా దుర్వాసన రావడంకానీ, వ్యర్థాలు రోడ్డుపై పడడం కానీ జరగకూడదు. ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ నిబంధనల అమలుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా కంటెయినర్ల ద్వారా చెత్తను డంపింగ్‌యార్డు కు రవాణాచేయాలని నిర్ణయించారు. ముందుగా రెం డు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వచ్చే వారం ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం దశలవారీగా 95ప్రాంతాలకు, ఆ తర్వాత 150ప్రాంతాల కు విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈతరహా కంటెయినర్లను ఉపయోగిస్తోంది. 


వీటి సామర్థ్యం 12 నుంచి 14 టన్నుల వర కూ ఉంటుంది. ఇంటింటి చెత్త సేకరించే ఆటో టిప్పర్లు ఇళ్లను సేకరించిన చెత్తను ఈ కంటెయినర్లలో వేస్తాయి. కంప్యాక్టింగ్‌ వ్యవస్థతో కూడిన ఈ కంటెయినర్లు నిం డిన అనంతరం వాహనం ద్వారా దాన్ని లాక్కొని వెళ్లి, ఆ ప్రదేశంలో మరో ఖాళీ కంటెయినర్‌ను ఏర్పాటు చేస్తారు. వీటి తయారీకి సమయం పడుతుందని, వారానికి రెండు చొప్పున తయారవుతాయని కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజక్టును రాంకీ ఎన్విరో సంస్థకు అప్పగించినందున కంటెయినర్ల ఏర్పాటు, తరలింపు పనులు వారి ఆధ్వర్యంలోనే కొనసాగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఆటో టిప్పర్ల ద్వారా సేకరిస్తున్న చెత్తను ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలించి అక్కడినుంచి పెద్ద టిప్పర్లలో దాన్ని డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. కాగా, కంటెయినర్లు వస్తే నేరుగా వాటిని లాక్కొని డంపింగ్‌యార్డుకు చేర్చే అవకాశం కలుగుతుంది. దీనివల్ల చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల చుట్టూ కాలుష్యం ఉండదు. 


logo