శనివారం 30 మే 2020
Hyderabad - Feb 15, 2020 , 02:04:19

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

 ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
  • సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌
  • గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన సీపీ

శేరిలింగంపల్లి: పర్యావరణ పరిరక్షణ, మానవాళి హితం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు. పర్యావరణ హితం కోసం రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శుక్రవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో సజ్జనార్‌ మొక్క లు నాటారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలోని ప్రతిఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను కనీసం 3 నెలలైనా కాపాడాలన్నారు. అలాగే మరో ముగ్గురిని మొక్కలు నాటేందుకు నామినేట్‌ చేయాలన్నారు. మొక్కలు నాటడం అనేది ఒక నిరంతర ప్రక్రి య కావాలన్నారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ దేశంలోని అన్ని మూలలకు వ్యాప్తి చెందాలన్నారు.


గిఫ్ట్స్‌కు బదులుగా మొక్కలను బహుమతులుగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పర్యావరణం, మొక్కల ప్రాధాన్యతపై తల్లిదండ్రులు, గురువు లు చెప్పడం ఉత్తమమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలను నాటాలనేది సీఎం కేసీఆర్‌ కల అని, ఈనెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని డీసీపీ కార్యాలయాలు, ఏసీపీ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు ఈచ్‌ వన్‌ -ప్లాంట్‌ వన్‌ అనే నినాదానికి కొనసాగింపుగా డీజీపీ మహేందర్‌ రెడ్డి పిలుపుమేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ప్రతిఒక్క పోలీస్‌ సిబ్బంది కనీసం ఒక్క మొక్కనైనా నాటాలన్నారు. 


గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా 99 టీవీ యాంకర్‌ రోజా, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు సంపూర్ణేశ్‌బాబు, జర్నలిస్ట్‌ స్వప్న, కమెడియన్‌ ఆది తనకు విసిరిన చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటినట్లు సీపీ తెలిపారు. అనంతరం మరో 9మందికి చాలెంజ్‌ విసిరారు. గూగుల్‌ వైస్‌ప్రెసిడెం ట్‌ అరిజిత్‌ సర్కార్‌, విప్రో సెంటర్‌ హెడ్‌ విజయ్‌ కేశినపల్లి, ఇన్ఫోసిస్‌ సెంటర్‌ హెడ్‌ రఘుబొడ్డుపల్లి, టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్న, టెక్‌ మహీంద్రా డైరెక్టర్‌ శివానం ద్‌, కాగ్నిజెంట్‌ సెంటర్‌ హెడ్‌ ప్రశాంత్‌ నాదెళ్ల, మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఎండీ రాజీవ్‌కుమార్‌, బ్రాడ్‌రిడ్జ్‌ ఎండీ లక్ష్మీకాంత్‌, స్టేట్‌ స్ట్రీట్‌ ఎండీ రమేశ్‌ఖాజా, క్వాల్‌కామ్‌ డైరెక్టర్‌ శశిరెడ్డి, వెల్స్‌ఫార్గో సెంటర్‌ హెడ్‌ శ్రీధర్‌, ఓపెన్‌ టెక్ట్స్‌ ఎండీ ఐజా క్‌ రాజ్‌కుమార్‌, రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి, యూటీసీ సెంటర్‌ హెడ్‌ ప్రకాశ్‌ బొడ్ల, ఫాక్ట్‌సెట్‌ హెడ్‌ వెం కట్‌లకు సీపీ సజ్జనార్‌ చాలెంజ్‌ విసిరారు. కార్యక్రమం లో గ్రీన్‌ చాలెంజ్‌ కోఫౌండర్‌ రాఘవ, వుమెన్‌ అండ్‌ చిల్డ్ర న్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ అనసూయ, క్రైమ్స్‌ అడిషనల్‌ డీసీపీ కవిత, సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ అడిషనల్‌ డీసీపీ మాణిక్‌ రాజ్‌, ఏసీపీలు లక్ష్మీనారాయణ, సంతోశ్‌కుమార్‌, ఆర్‌ఐలు మట్టయ్య, హిమకర్‌, విష్ణు, సురేశ్‌ పాల్గొన్నారు. 


logo