గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Feb 14, 2020 , 04:27:11

40 లక్షల విలువైన మంచినీటి చౌర్యం

40 లక్షల విలువైన మంచినీటి చౌర్యం
  • ఐడీఏ నాచారంలో ఓ కంపెనీ నిర్వాకం
  • అక్రమంగా నల్లా తీసుకొని నీటివాడకం
  • కంపెనీ యజమానిపై క్రిమినల్‌ కేసు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అక్రమ నల్లా కనెక్షన్ల ఏరివేతలో జలమండలి దూకుడు పెంచింది. జలమండలి అధికారుల అనుమతిలేకుండా అక్రమమార్గంలో నల్లాలను ఏర్పరచుకుని సంస్థ ఖజానాకు గండికొడుతు న్న అక్రమార్కుల భరతం పట్టేందుకు గడిచిన కొన్ని నెలలుగా విజిలెన్స్‌ విభాగం అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. ఇప్పటికే వందలసంఖ్యలో అక్రమ కనెక్షన్ల ను గుర్తించి వాటిని తొలగించడంతోపాటు సంబంధిత భవన యాజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులోభాగంగానే తాజాగా ఐడీఏ నాచారం లో మెస్సర్‌ స్టాలియన్‌ టైర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఘరానా మోసాన్ని విజిలెన్స్‌ బృందం గుర్తించింది. దాదాపు మూ డున్నరేళ్లుగా అధికారుల కళ్లుగప్పి అక్రమంగా నల్లా కనెక్షన్‌ను ఏర్పరచుకుని యథేచ్ఛగా నీటిని వాడుకుంటున్నా డు. సంస్థకు భారీగా ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టే ఎం ఎస్‌బి కేటగిరిలో ఉన్న కనెక్షన్లపై నిరంతరం పర్యవేక్షించాల్సిన క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యాన్ని అధికారులు గుర్తించారు. ఇటు అధికారుల బాధ్యతారాహిత్యం, అటు సదురు కంపెనీ అక్రమాన్ని ఎండీ దానకిశోర్‌ దృష్టికి విజిలెన్స్‌ అధికారులు తీసుకువెళ్లారు. ఎండీ ఆదేశాల మేరకు సంబంధిత అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో పా టు కంపెనీ యాజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశా రు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన స్థానిక మేనేజర్‌, మీటర్‌ రీడర్లపై చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్‌ అధికారులు ఎండీకి సిఫారసు చేయడం గమనార్హం. 


ఐడీఏ నాచారం ప్లాట్‌ నంబర్‌ 9లోని మెస్సర్‌ స్టాలియన్‌ టైర్స్‌ లిమిటెడ్‌ భవనానికి 2016లో నల్లా బిల్లు చెల్లించనందుకుగానూ జలమండలి అధికారులు అధికారికంగా కంపెనీకి ఉన్న 40 ఎంఎం నల్లా కనెక్షన్‌ను తొలగించారు. ఐతే ఆ తర్వాత జలమండలి అధికారుల అనుమతులు తీసుకోకుండా అక్రమమార్గంలో నల్లా తీసుకు ని ప్రస్తుతం వరకు దాదాపుగా రూ.40 లక్షల విలువ గల 25,116 లీటర్ల నీటిని అక్రమంగా వినియోగించుకున్న ట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో రూ.40 లక్షలతోపాటు ఇప్పటివరకు చెల్లించకుండా బకాయిపడిన బిల్లు రూ.30 లక్షలతో కలిపి మొత్తం రూ.70 లక్షలు కం పెనీ యాజమాన్యం జలమండలికి చెల్లించాల్సి ఉంది. ఇందులోభాగంగానే ఎండీ దానకిశోర్‌ ఆదేశాల మేరకు సంబంధిత భవన యాజమాని వీఎంఎన్‌ వెంకటేశ్‌పై నాచారం పోలీస్‌స్టేషన్‌లో యూ/ఎస్‌ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జలమండలి అధికారుల అనుమతిలేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుం టే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఎవరైన అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమిస్టిక్‌ కనెక్షన్‌ తీసుకొని కమర్షియల్‌ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్‌ బృందానికి 9989998100, 9989992268 నంబర్లకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.  


logo