శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 13, 2020 , 23:31:39

తప్పుచేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి

తప్పుచేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి

మన్సూరాబాద్‌: తప్పుచేస్తే శిక్షపడుతుందనే భయం నేరస్తుల్లో ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నా రు. ఎల్బీనగర్‌, నాగోల్‌ డివిజన్‌ బండ్లగూడ పరిధి జీఎస్‌ఐ టీఐ ప్రాంగణంలోని ఎంఎస్‌ కృష్ణన్‌ హాల్‌ లో గురువారం సాయంత్రం నిర్వహించిన రాచకొం డ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి కన్విక్షన్స్‌ రివార్డ్‌ మేళా (నేరస్తులకు శిక్షపడేలా కృషి చేసిన పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు అవార్డులు ప్రదానం)ను నిర్వహించారు. బొమ్మలరామారం పీఎస్‌ పరిధి హజీపూర్‌ విలేజ్‌లో జరిగిన కేసుతోపాటు హయత్‌నగర్‌ పీఎస్‌, మేడిపల్లి పీఎస్‌, నాచారం పీఎస్‌, భువనగిరి టౌన్‌ పీఎస్‌, ఎల్బీనగర్‌ పీఎస్‌, సరూర్‌నగర్‌ పీఎస్‌, యాదగిరిగుట్ట పీఎస్‌, ఘట్కేసర్‌ పీఎస్‌, ఆదిభట్ల పీఎస్‌, వనస్తలిపురం పీఎస్‌ పరిధిల్లోని ప్రధానకేసుల్లో శిక్షలు పడేలా కృషి చేసిన 226 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి రివార్డులు అందజేసి సన్మానించారు. ఈ సం దర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలోఉన్న  ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, పోలీసులు, ప్రాసిక్యూటర్స్‌తో పాటు క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌లోని అన్ని విభాగాలు సమర్థ వంతంగా పనిచేసి నేరస్తులకు శిక్షలుపడేలా చేసి ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాలన్నారు. సమాజంలోని మెజార్టీ ప్రజలంద రూ చట్ట ప్రకారం నడుచుకున్నప్పుడు శాంతిభద్రతలు మెరుగవ్వడంతోపాటు ప్రజారక్షణకు అవకాశం ఉంటుందని తెలిపారు. 


చట్టాన్ని ఉల్లంఘిస్తే దొరికిపోతామనే నమ్మకాన్ని నేరస్తుల్లో కలుగజేయడం.. ఏదైనా తప్పుచేసి దొరికితే తప్పకుం డా శిక్ష పడుతుందనే భయాన్ని వారిలో కల్పించాలన్నారు. నేరం చేసిన వారిని గుర్తించడంతోపాటు కేసును సమర్థవంతంగా త్వరితగతిన దర్యాప్తు చేసి పూర్తి చేయాలన్నారు. సరైన సాక్ష్యాలను సేకరించడంతోపాటు ముఖ్యంగా సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ను కలెక్ట్‌ చేయడం ద్వారా నేరస్తులకు శిక్షలుపడేలా చేయవచ్చునన్నారు. రాష్ట్రంలో నేరం చేస్తే వందశాతం దొరికిపోతామనే భావన నేరస్తుల్లో కలిగే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందులోభాగంగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారని తెలిపా రు. ప్రజల సహకారాలతో నేను సైతం, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టుల కింద రాష్ట్రంలో సుమారు 7లక్షల సీసీటీవీ కెమెరా లు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుల్లో ముందున్నారని తెలిపారు. కేసుల దర్యాప్తులో నిజమైన నేరస్తులకు శిక్షపడేలా చూడాలని తెలిపారు. కోర్టు ట్రయల్‌ప్రాసెస్‌లో నేరుగా ఇన్వాల్వ్‌ అయి నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. 


హజీపూర్‌ ఘటనలో బాధితులకు న్యాయం జరిగింది

సీపీ మహేస్‌భగవత్‌ అందరిని సమన్యయపరుస్తూ హజీపూర్‌ ఘటనలో నేరస్తుడికి శిక్ష పడేలా చేశారని డీజీపీ తెలిపారు. అమాయకులైన బాలికల ప్రాణాలు తీసిన నేరస్తుడికి ఉరిశిక్ష పడేలా చూడటంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జి.వైజయంతి, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌, అడిషనల్‌ సీపీజి సుధీర్‌బాబు, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, డీసీపీలు నారాయణరెడ్డి, రక్షితమూర్తి, డీసీపీ క్రైమ్స్‌ యాదగిరి, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ శిల్పవల్లి, డిప్యూటీ డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్స్‌ రాము, నల్గొండ కోర్టులు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చంద్రశేఖర్‌, హజీపూర్‌ సర్పంచ్‌ కవితావెంకటేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo