మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 11, 2020 , 01:08:36

ఉత్తమ నగరంగా అభివృద్ధి చేద్దాం..

ఉత్తమ నగరంగా  అభివృద్ధి చేద్దాం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ సర్వేలో హైదరాబాద్‌ నగరానికి ఉత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా గుర్తింపు తెచ్చేందుకు నగరవాసులు తమవంతు తోడ్పాటును అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈనెల 29వ తేదీవరకు ‘మై సిటీ-మై ప్రైడ్‌' పేరిట దేశవ్యాప్తంగా 120 అమృత్‌ నగరాలు, పట్టణాల్లో ఈ సర్వే జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. 


 సర్వేలో పాల్గొనేందుకు జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌, సిటిజన్‌ సర్వే QR కోడ్‌, లేదా https://eol2019.org/citizenfeedback, https://twitter.com/GHMCOnline/status/1225334039084556289?s=08లింకును ఉపయోగించుకోవాలని కమిషనర్‌ సూచించారు. వివరాలకు జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040-21 11 11 11ను సంప్రదించాలని కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌లో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మూ డోస్థానంలో ఉన్నట్లు, దీన్ని మొదటిస్థానానికి చేర్చేందుకు సర్వేలో సానుకూలంగా పాల్గొనాలని కోరారు. దేశవ్యాప్తంగా అమృత్‌ పథకం కింద తీసుకున్న 120 పట్టణాలు, నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలపై ర్యాంకింగ్‌లు ఇచ్చేందుకు 20సెక్టార్లలో 100 ఇండికేటర్లతో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జీహెచ్‌ఎంసీతోపాటు వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో అమృత్‌ పథకం అమలవుతున్నట్లు పేర్కొన్నారు. 10లక్షల పైబడి జనాభా ఉన్న నగరాలను ఈ సర్వేకోసం ఎంపికచేశారు. సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌లో ఉన్న 20 ఇండికేటర్స్‌లో ప్రధానంగా వైద్యం, విద్య, సాంకేతికత, పర్యావరణం, రవాణా, ఉపాధి, ఇంటి అద్దెలు, పారిశుధ్యం, తాగునీరు, భద్ర త, అత్యవసర సేవలు, మహిళా భద్రత, రీక్రియేషన్‌, బ్యాంకింగ్‌, ఏటీఎం, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలున్నాయి.  కేంద్రం నిర్వహిస్తున్న ఈ సర్వేలో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌కు 30 మార్కులు ఉన్నట్లు వెల్లడించారు. నగరంలో పౌరసేవలను విస్తరింపజేసి నగరానికి మరిన్ని పెట్టుబడులు రాబట్టేందుకు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో పాల్గొనాలని, దీనివల్ల ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ వివరించారు. 


logo
>>>>>>