ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 23, 2021 , 05:46:48

పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల

పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల

  • మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల తుది ఓటరు జాబితా విడుదల
  • జాబితాలో 37 శాతం మంది మహిళలు
  • అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 27.22% ఓటర్లు
  • కనిష్ఠంగా నారాయణపేట జిల్లాలో 13568 మంది
  • తొమ్మిది జిల్లాల్లో 1,382 ఓట్లు తొలగింపు
హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్క తేలిపోయింది. గత జాబితా 2015లో కంటే ఏకంగా 181 శాతం పెరుగుదలతో తాజా తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. తొమ్మిది కొత్త జిల్లాలతో కూడిన మూడు ఉమ్మడి జిల్లాల్లో తాజా ఓటర్ల సంఖ్య 5,17,883గా నమోదైంది. జాబితాలో 3,27,727 మంది పురుషులు ఉండగా 1,90,088 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితాను గత నెల ఒకటో తేదీన విడుదల చేయగా.. అప్పుడు ఓటర్ల జాబితాలో 4,48,961 మంది ఓటర్లు ఉన్నారు. అనంతరం కొత్త వాటి నమోదుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తుది నివేదికలో అదనంగా 70,304 మందిని చేర్చారు. అదే సమయంలో నియోజకవర్గ పరిధిలో 1,382 ఓట్లను వివిధ కారణాలతో తొలగించారు. 

రంగారెడ్డిలోనే అత్యధికం..

గత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 2015తో పోలిస్తే గణనీయంగా పెరుగుదల నమోదు కాగా.. పాత, కొత్త జిల్లాల పరంగా చూసినా రంగారెడ్డిలోనే ఇతర జిల్లాల కంటే ఎక్కువ మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే.. మహబూబ్‌నగర్‌లో 2015లో 66,100 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,16,704కు చేరింది. అంటే 176 శాతం పెరుగుదల నమోదైంది. రంగారెడ్డిలో గతంలో 1,33,003 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు 2,94,055 మంది ఉన్నారు. ఇక్కడ పెరుగుదల 121 శాతంగా నమోదైంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఇతర రెండు ఉమ్మడి జిల్లాల కంటే పట్టభద్రుల ఓటర్లు తక్కువగా ఉన్నారు. ఇక్కడ 2015లో 87,208 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,07,124కు చేరిం ది. అంటే ఇక్కడ కేవలం 22.83 శాతం పెరుగుదల  నమోదైంది. కొత్త జిల్లాల వారీగా చూస్తే మొదటి స్థానంలో రంగారెడ్డి నిలవగా,  మేడ్చల్‌-మల్కాజిగిరి,    మూడో స్థానంలో హైదరాబాద్‌ ఉంది. చివరన నారాయణపేట్‌ ఉండగా ఆ పైన జోగులాంబ గద్వాల, వికారాబాద్‌ ఉన్నాయి.

VIDEOS

తాజావార్తలు


logo