మంగళవారం 26 జనవరి 2021
Hyderabad - Nov 27, 2020 , 08:07:11

శంషాబాద్‌లో రూ.18 లక్షల బంగారం పట్టివేత

శంషాబాద్‌లో రూ.18 లక్షల బంగారం పట్టివేత

శంషాబాద్‌ రూరల్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రూ.18 లక్షల బంగారాన్ని గురువారం కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రియాద్‌ నుంచి ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా  బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టగా.. జీన్స్‌ ప్యాంటు జేబుల్లో తరలిస్తున్న 369.8 గ్రాముల బంగారాన్ని నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.18 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇద్దరిని  అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   


logo