e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News కొత్త మ‌లుపు తిరిగిన‌ రంగురాళ్ల చోరీ కేసు

కొత్త మ‌లుపు తిరిగిన‌ రంగురాళ్ల చోరీ కేసు

కొత్త మ‌లుపు తిరిగిన‌ రంగురాళ్ల చోరీ కేసు

హైద‌రాబాద్ : జ్యోతిష్కుడు ముర‌ళీకృష్ణ శ‌ర్మ‌ ఇంట్లో చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. త‌న ఇంట్లో రంగు రాళ్లు చోరీ అయ్యాయ‌ని వారం రోజుల క్రితం ముర‌ళీకృష్ణ శ‌ర్మ ఎల్బీన‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ముర‌ళీకృష్ణ శ‌ర్మ తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. పోలీసుల ద‌ర్యాప్తులో మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

బెల్లంకొండ ముర‌ళీకృష్ణ శ‌ర్మ ఇంట్లో భారీగా న‌గ‌దు గుర్తించారు. రూ. 17.72 కోట్ల విలువ చేసే న‌కిలీ రూ. 2 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ న‌కిలీ క‌రెన్సీతో పాటు రూ. 6 ల‌క్ష‌ల 32 వేల న‌గ‌దు, 10 సెల్‌ఫోన్లు, కారు సీజ్ చేశారు. డ‌బ్బు విష‌యం దాచి రంగురాళ్లు పోయాయ‌ని ఆయ‌న ఫిర్యాదు చేశాడు. ముర‌ళీకృష్ణ‌తో పాటు మ‌రో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 90 కోట్ల హ‌వాలా మ‌నీ కేసులో గ‌తంలో ముర‌ళీకృష్ణ జైలుకు వెళ్లొచ్చాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొత్త మ‌లుపు తిరిగిన‌ రంగురాళ్ల చోరీ కేసు
కొత్త మ‌లుపు తిరిగిన‌ రంగురాళ్ల చోరీ కేసు
కొత్త మ‌లుపు తిరిగిన‌ రంగురాళ్ల చోరీ కేసు

ట్రెండింగ్‌

Advertisement