శనివారం 04 జూలై 2020
Hyderabad - Jul 01, 2020 , 01:05:48

21 రోజుల్లో 11559

21 రోజుల్లో 11559

పెరుగుతూనే ఉన్న కరోనా కేసులు.. 

నిర్లక్ష్యం వీడని నగర వాసులు.. 

స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష

కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మాస్కులు ధరించండి, భౌతికదూరం పాటించండి.. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకండి.. అని ఎంతమొత్తుకున్నా.. వినడంలేదు. అంతా మా ఇష్టం అన్న రీతిలో అవసరం ఉన్నా.. లేకున్నా.. ఇష్టారాజ్యంగా రోడ్లపై సంచరిస్తున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడంలేదు. పసిపిల్లల నుంచి పండు ముసలివరకూ ఏ ఒక్కరినీ వదలడంలేదు. ఇంట్లో ఒక్కరి నిర్లక్ష్యంతో కుటుంబమంతా వైరస్‌ బారిన పడాల్సి వస్తున్నది. దీంతో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని గ్రహించిన పలువురు వ్యాపారులు మార్కెట్లకు స్వచ్ఛందంగా తాళం వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే బేగంబజార్‌,  సికింద్రాబాద్‌, రాణిగంజ్‌ మార్కెట్లు మూతపడగా నేటి నుంచి బార్బర్‌ షాపులు సైతం స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10 నుంచి 30 వరకు జీహెచ్‌ఎంసీలో 10,170 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 907, మేడ్చల్‌లో 482 వచ్చాయి. మొత్తం 11,559మందికి పాజిటివ్‌ వచ్చింది. 

ఏ మాత్రం తగ్గడంలేదు..

జీహెచ్‌ఎంసీ 10,170

రంగారెడ్డి 907

మేడ్చల్‌ 482

మంగళవారం ఒక్కరోజే..

జీహెచ్‌ఎంసీ 869

రంగారెడ్డి 29

మేడ్చల్‌ 13

ఉప్పల్‌లో 42 కరోనా కేసులు నమోదు.

రామంతాపూర్‌ : ఉప్పల్‌ ఆరోగ్యకేంద్రం పరిధిలో మంగళవారం 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యకేంద్రం అధికారి వెల్లడించారు. కరోనా వచ్చిన ప్రాంతాల్లో వారికి చికిత్స అందిస్తూ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు మొత్తం 180 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఎల్బీనగర్‌లో 17 మందికి..

ఎల్బీనగర్‌ : ఎల్బీనగర్‌ మూడు సర్కిళ్ల పరిధిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. హయత్‌నగర్‌ సర్కిల్‌ నాగోలులో వ్యక్తికి, ఎల్బీనగర్‌ సర్కిల్‌ సాయిశంకర్‌కాలనీలో యువకుడికి, సరూర్‌నగర్‌ సర్కిల్‌ మారుతీనగర్‌లో  మహిళకు, అంబేద్కర్‌నగర్‌లో ఇద్దరికి, ప్రతాప్‌నగర్‌లో ఇద్దరికి, గడ్డిఅన్నారంలో ఒకరికి, సమతానగర్‌లో యువకుడికి, పోచమ్మగడ్డలో మహిళకు, మారుతీనగర్‌లో వ్యక్తికి, హుడాకాలనీలో వ్యక్తికి, వివేకానందనగర్‌లో ఇద్దరు మహిళలకు, లక్ష్మీనర్సింహాపురంలో వృద్ధుడికి, ఎస్‌ఆర్‌ఎల్‌కాలనీలో వ్యక్తికి, ఫతేనగర్‌లో యువకుడికి పాజిటివ్‌ వచ్చింది.

అంబర్‌పేటలో 12మందికి..

అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేట డివిజన్‌లో 3, నల్లకుంటలో 6, బాగ్‌అంబర్‌పేటలో 1, కాచిగూడలో 2 కేసులు నమోదయ్యాయి. 

కూకట్‌పల్లిలో 10 మందికి పాజిటివ్‌

బాలానగర్‌ : మూసాపేట సర్కిల్‌ పరిధిలోని ఫతేనగర్‌లో 2, మూసాపేట్‌లో 2, ఆల్విన్‌కాలనీ కమలప్రసన్ననగర్‌లో 1, వివేకానందకాలనీలో 1, కేపీహెచ్‌బీకాలనీ 7వ ఫేజ్‌లో 1, ఓల్డ్‌బోయిన్‌పల్లి ఎంకేఆర్‌ టవర్స్‌లో 1, బాలానగర్‌, వినాయక్‌నగర్‌, రాజుకాలనీలలో 2 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఉమ్మడి  వైద్యాధికారి డాక్టర్‌ చందర్‌ తెలిపారు.

శాంతినగర్‌లో 11 మందికి..

అహ్మద్‌నగర్‌ : శాంతినగర్‌ పీహెచ్‌సీ పరిధిలో మంగళవారం 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ మహేశ్‌ తెలిపారు. చింతల్‌బస్తీ ఏసీ గార్డ్స్‌లో మహిళకు (30), వ్యక్తికి(40), అహ్మద్‌నగర్‌ డివిజన్‌ సయ్యద్‌నగర్‌లో వ్యక్తికి(54) పాజిటివ్‌ వచ్చింది.

బాలాపూర్‌ మండలంలో 225 కేసులు

బడంగ్‌పేట : బాలాపూర్‌ మండల పరిధిలో ఇప్పటి వరకు 225కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. జెల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ, మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్ల పరిధిలోని అధికారులు, కార్పొరేటర్లు, పోలీసులు, వైద్యసిబ్బందికి వైరస్‌ సోకింది. దీంతో కార్యాలయాలకు ఎవరూ రావద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. ఫిర్యాదులేమైనా ఉంటే ఆన్‌లైన్‌లో చేయాలని తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా వైద్యసిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నలుగురికి, బడంగ్‌పేటలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. 

కుత్బుల్లాపూర్‌లో 25 మందికి..

దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో మంగళవారం 25మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 304కు చేరుకున్నది. 

నిలోఫర్‌ దవఖానలో ముగ్గురికి..

తెలుగుయూనివర్సిటీ : నిలోఫర్‌ దవాఖానలో కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురికి మంగళవారం పాజిటివ్‌ వచ్చింది. నిలోఫర్‌  ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతలకుంట మండలం హనుమాన్‌కాలనీకి చెందిన బాలుడికి(6), దవాఖానలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్‌ వచ్చినట్లు దవాఖాన కో ఆర్డినేటర్‌ చంద్రమోహన్‌ తెలిపారు.

 వెంగళరావునగర్‌ : యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్‌లో 4, ఎర్రగడ్డలో 2, బోరబండలో 1, రహమత్‌నగర్‌లో 2 కేసులు నమోదైనట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. 

 హిమాయత్‌నగర్‌: హిమాయత్‌నగర్‌లో ముగ్గురు, నారాయణగూడలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఏఎంహెచ్‌వో డాక్టర్‌ హేమలత తెలిపారు.

 కీసర : కీసరలో ఓ డాక్టర్‌కు పాజిటివ్‌ వచ్చింది. 

 చిక్కడపల్లి : చిక్కడపల్లి వివేక్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఉద్యోగికి కరోనా సోకడంతో ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. ఆలయంలో నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ వైద్యపరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు ఈవో దేవనాథం తెలిపారు.

 మేడ్చల్‌ రూరల్‌ : మేడ్చల్‌ ప్రాంతంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మండల పరిధిలోని డబిల్‌పూర్‌ గ్రామానికి చెందిన యువకుడికి(25), ఘనపూర్‌ తండాకు చెందిన వ్యక్తికి(38), 108 అంబులెన్స్‌ డ్రైవర్‌కు(28) కరోనా సోకింది.

 అడ్డగుట్ట : తుకారాంగేట్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తికి (42), మహిళకు(32) కరోనా పాజిటివ్‌ వచ్చింది.

ఈ నెల 10 నుంచి 30 వరకు కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు

తేదీ జీహెచ్‌ఎంసీ     రంగారెడ్డి     మేడ్చల్‌

10             143                     8                     11

11                 175                     7                     10

12                 133                     6                       6

13                 179                     11             14

14                 195                        8             10

15                 189                     13                 2

16                 165                     16                 3

17                 214                     13                 2

18                 302                     17              10

19                 329             129                 4

20                 458                         50                 6

21                 659                         10                 9

22                 713                     107                16

23                 652                     64             112

24                 719                     86                 55

25                 737                     86                 60

26                 774                     86                 53

27                 888                     74                 37

28                 816                     47                 29

29                 861                     40                 20

30                 869                     29                 13

మొత్తం     10,170             907                 482


logo