e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home హైదరాబాద్‌ అర్ధరాత్రి 108లో ప్రసవం

అర్ధరాత్రి 108లో ప్రసవం

అర్ధరాత్రి 108లో ప్రసవం
  • అక్కున చేర్చుకున్న ప్రసూతి దవాఖాన
  • తల్లీబిడ్డలు క్షేమం.. డిశ్చార్జీ చేసి కేసీఆర్‌ కిట్టు అందజేత

సుల్తాన్‌బజార్‌, మే 21: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో 24గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందజేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. సంగారెడ్డికి చెందిన జ్యోతి(20), రమేశ్‌ భార్యాభర్తలు. జీవనోపాధి నిమిత్తం మూడేండ్ల కిందట నగరానికి వచ్చి రామాంతపూర్‌ గాంధీనగర్‌లో నివాముంటున్నారు. రమేశ్‌ సెంట్రింగ్‌ పని చేస్తుండగా, జ్యోతి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. ప్రసూతి దవాఖా న వైద్యులు జూన్‌ 8న ప్రసవం తేదీ ఇచ్చారు. కాని గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జ్యోతికి పురిటి నొప్పులొచ్చాయి.

ఆ సమయంలో భర్త రమేశ్‌ తన అక్క ఇంటికి వెళ్లగా, ఇంట్లో తన యేడాదిన్నర బాబు మాత్రమే ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది జ్యోతిని ప్రసవం నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికం అయ్యాయి. దీంతో 108 టెక్నిషియన్‌ పురుడు పోశారు. తల్లీబిడ్లను వైద్య పరీక్షల నిమిత్తం కోఠి ప్ర సూతి దవాఖానకు తరలించారు. వైద్యులు తల్లీబిడ్డలకు మెరుగైన వైద్యం అందజేశారు. అనంతరం వారికి కేసీఆర్‌ కిట్లు అందజేసి డిశ్చార్జ్‌ చేశారు.

వైద్యులు దేవుళ్లు..

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురిటి నొప్పులు రావడంతో చాలా భయమేసింది. కరోనా సమయంలోనూ.. ఎలాంటి ఆలస్యం చేయకుండా.. 108 సిబ్బంది, ప్రభుత్వ దవాఖాన వైద్యులు తనకు, తన పాపకు ప్రాణం పోశారు. నిజంగా ప్రభుత్వ వైద్యులు దేవుళ్లతో సమానం. ఇది నాకు రెండవ కాన్పు. మొదటి కాన్పు సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలోనే అయ్యింది. జ్యోతి, రామంతాపూర్‌, గాంధీనగర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్ధరాత్రి 108లో ప్రసవం

ట్రెండింగ్‌

Advertisement