మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Aug 05, 2020 , 23:16:00

శరీరంలోకి ప్రవేశించి 10 రోజులు దాటితే.. వైరస్‌ సంక్రమించదు

శరీరంలోకి ప్రవేశించి 10 రోజులు దాటితే.. వైరస్‌ సంక్రమించదు

శరీరంలోకి ప్రవేశించి 10 రోజులు దాటితే.. వైరస్‌ సంక్రమించదు

14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి

గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి విషయంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మహమ్మారి బారిన పడిన వారి నుంచి వైరస్‌ వ్యాపించే విషయంలో వైద్యులు కీలకమైన అంశాలను గుర్తించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నుంచి 10 రోజుల తర్వాత వైరస్‌ వ్యాప్తి చెందదని వైద్యులు చెబుతున్నారు. అందువల్లే కరోనా రోగులు 10 నుంచి 14 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. 10 రోజుల తరువాత రోగిలో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందని.. దీని వల్ల సదరు రోగి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు పెద్దగా ఉండవన్నారు. అందువల్లే కరోనా రోగులకు 10 రోజుల చికిత్స అనంతరం రెండోసారి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జ్‌ చేయాలని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఎలాంటి లక్షణాలూ లేనివారికి  దవాఖానలో చికిత్స అవసరం లేదని.. వారు 10 నుంచి 14 రోజులు హోం ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుందని రాజారావు వివరించారు.


logo