బంజారాహిల్స్, అక్టోబర్ 13: ఫేస్బుక్లో చాటింగ్ పేరుతో నమ్మిం చి ఓ యువకుడి నగ్న వీడియోలు సేకరించి బెదిరింపులకు గురిచేస్తున్న యువతిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం 12లోని బోళానగర్కు చెందిన మహ్మద్ గౌస్(31) ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ ఏడాది జూలైలో ఫేస్బుక్లో సాక్షి వర్మ అలియాస్ సాక్షిరెడ్డి పేరుతో ఓ యువతి గౌస్‌కు పరిచయమైంది. వారిద్దరూ తరచూ ఫేస్బుక్లో చాటింగ్ చేసుకునేవారు. కాగా కొన్నిరోజుల తర్వాత ఆమె వీడియో కాల్ చేయడంతో పాటు బట్టలు విప్పేసి అతడిని కూడా నగ్నంగా మారమని చెప్పింది. దాంతో అతడు కూడా బట్టలు విప్పేయగా దాన్ని వీడియో రికార్డింగ్ చేసిన యువతి అతడిని బెదిరింపులకు గురిచేయడం ప్రారంభించింది. ఈ వీడియోను అడ్డుగా పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ బాధితుడు గౌస్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.