e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

రంగారెడ్డి జిల్లాలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

రంగారెడ్డి జిల్లాలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

బడంగ్‌పేట, మే 1: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మీర్‌పేట మున్సిపల్‌ కార్యాలయంలో ఆమె జిల్లా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పహాడీ షరీఫ్‌లోని ప్రీమియర్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌ను 24 గంటల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చాలని ఆదేశించారు. ఇప్పటికే వనస్థలిపురంలో 100 పడకలు, కొండాపూర్‌లో మరో 100 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, శివరాంపల్లి, షాద్‌నగర్‌లో యుద్ధప్రాతిపదికన సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

  • కొత్తగా ఏర్పాటు చేసే ఈ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు.
  • లక్షణాలు ఉన్నవారే పరీక్షలు చేయించుకోవాలని.. పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసొలేషన్‌లో ఉండాలన్నారు.
  • అవసరమైతేనే వైద్యశాలకు వెళ్లాలన్నారు.
  • కొవిడ్‌ నిబంధనలపై అధికారులు స్థానికులకు అవగాహన కల్పించాలన్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రంగారెడ్డి జిల్లాలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

ట్రెండింగ్‌

Advertisement