e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home క్రైమ్‌ డేటింగ్‌ యాప్‌లో చాటింగ్‌ రూ.10 లక్షలు చీటింగ్‌

డేటింగ్‌ యాప్‌లో చాటింగ్‌ రూ.10 లక్షలు చీటింగ్‌

డేటింగ్‌ యాప్‌లో చాటింగ్‌ రూ.10 లక్షలు చీటింగ్‌
  • స్నేహం కోసం డేటింగ్‌ సైట్‌లోకి వెళ్లిన వృద్ధుడు
  • మాటల్లో పెట్టి రూ.10లక్షలు కాజేసిన సైబర్‌నేరగాళ్లు
  • పెట్టుబడి, రుణాల పేరుతో ఖాతాలు ఖాళీ
  • తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ సామగ్రిపేరుతో మరో మోసం

సిటీబ్యూరో, జులై 20(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు (77) కేంద్ర సర్వీస్‌ల్లో పనిచేసి రిటైర్డు అయ్యాడు. లాక్‌డౌన్‌లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆన్‌లైన్‌లో స్నేహం చేసే వాళ్లు దొరుకుతారని ఏప్రిల్‌లో డేటింగ్‌ యాప్‌లోకి వెళ్లాడు. యాప్‌లో ఒక నంబర్‌కు ఫోన్‌ చేయడంతో సైబర్‌ నేరగాళ్లు స్నేహం చేసేందుకు ముందుగా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలంటూ మొదలు పెట్టి, నెమ్మదిగా అతన్ని మాటల్లో పెట్టి పలు దఫాలుగా రూ.7లక్షలు వసూలు చేశారు. తాను మోసపోతున్నానని గ్రహించిన సదరు వృద్ధుడు, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలంటే మరో రూ. 3లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఇలా మొత్తం రూ.10లక్షలు పోయిన తరువాత, అవతలి ఫోన్లన్నీ స్విచాఫ్‌ అయ్యాయి. దీంతో మంగళవారం బాధితుడు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పెట్టుబడి పెట్టడంటూ..

మొఘల్‌పురాకు చెందిన సయ్యద్‌ సోహెబ్‌ మెహిన్‌ ఫేస్‌బుక్‌ చూస్తుండగా పెట్టుబడి పెట్టడం యాడ్‌ కన్పించింది. దాన్ని క్లిక్‌ చేయడంతో తమ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టండి భారీ లాభాలిస్తామంటూ ప్రకటనలు వచ్చాయి. అది నమ్మి అందులో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయడంతో డబ్ల్యూపీన్‌స్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి దాని ద్వారా డబ్బు చెల్లించాలని సూచించడంతో బాధితుడు రూ. 10 వేలు చెల్లించాడు. స్క్రీన్‌పై మరుసటి రోజు రూ. 20 వేలు కన్పించాయి కాని వాటిని డ్రా చేసుకునేందుకు వీలు లేదనే ఒక షరతు ఉంది. ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ సూచనలు రావడంతో మొత్తం రూ. 2.4 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత ఆ అప్పటి వరకు పనిచేసిన ఫోన్‌ స్విచాఫ్‌ అయ్యింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో క్రెడిట్‌ కార్డు పాయింట్స్‌ పేరుతో కాచిగూడకు చెందిన నందన్‌ వద్ద సైబర్‌నేరగాళ్లు లక్ష రూపాయలు కాజేశారు.

ఫొటోలు చూసి బోల్తా పడ్డాడు..

- Advertisement -

ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యాపారి తన షోరూంలో వాషింగ్‌ మెషీన్‌లు, ఫ్రిజ్జులు, ఏసీలు ఇతర ఎలక్ట్రిక్‌ సామ గ్రి తక్కువ ధరకు దొరుకుతాయంటూ యూ ట్యూబ్‌లో ప్రచారం చేసుకున్నాడు. ఈ ప్రకటనను చూసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సదరు వ్యాపారికి ఫోన్‌ చేసి తాను కూడా ఇదే వ్యాపారం చేస్తానని నీకు ఇంకా తక్కువ ధరకే వస్తువులను ఇస్తానంటూ అతని ఎలక్ట్రిక్‌ సామగ్రి గోడౌన్‌ను వాట్సాప్‌ కాల్‌లో చూపించాడు. ఇది నమ్మిన వ్యాపారి మొత్తం రూ.13 లక్షల విలువైన సామాగ్రి కోసం వారు చెప్పిన బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేశాడు.ఎంతకీ వస్తువులు రాకపోవడంతో వారు చేసిన ఫోన్‌నంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మోసం జరిగిందని గుర్తించినవ్యాపారి సైబర్‌క్రైంపోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రుణాలపేరుతో మోసం చేసిన సైబర్‌ ముఠా అరెస్ట్‌

సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ):రుణాలిప్పిస్తామంటూ నమ్మించి, మోసం చేస్తున్న ఢిల్లీకి చెం దిన కాల్‌సెంటర్‌ గ్యాంగ్‌ను మంగళవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి కథనం ప్రకారం..పంజాబ్‌కు చెంది న విజయ్‌ ధావన్‌ తన స్నేహితులైన కపిల్‌ ఠాకూరు, అభయ్‌వర్మతో కలిసి కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన అనిల్‌కుమార్‌కు బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ నుంచి రుణాలిప్పిస్తామంటూ నమ్మించి రూ.9,44,351లు మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు ద ర్యాప్తు చేపట్టారు. బాధితుడు డబ్బు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాలు, ఫోన్‌కాల్స్‌ ఆధారంగా నేరగాళ్లు ఢిల్లీ నుంచి మోసం చేసినట్లు గుర్తించిన పోలీసు బృందం ఢిల్లీకి వెళ్లి ముగ్గురిని అరెస్టు చేసి, నగరానికి తీసుకువచ్చారు. ఈ ముఠా నుంచి 8ఫోన్ల్లు, 24 డెబిట్‌ కార్డులు, 3 పాస్‌ పుస్తకాలు, 10చెక్‌బుక్స్‌,రూ. 2లక్షల నగదును స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డేటింగ్‌ యాప్‌లో చాటింగ్‌ రూ.10 లక్షలు చీటింగ్‌
డేటింగ్‌ యాప్‌లో చాటింగ్‌ రూ.10 లక్షలు చీటింగ్‌
డేటింగ్‌ యాప్‌లో చాటింగ్‌ రూ.10 లక్షలు చీటింగ్‌

ట్రెండింగ్‌

Advertisement