e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home హైదరాబాద్‌ అన్ని రైళ్లల్లో కొవిడ్‌ నిబంధనలు అమలు

అన్ని రైళ్లల్లో కొవిడ్‌ నిబంధనలు అమలు

  • రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైళ్ల లో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు.
  • అన్ని రైళ్లలో ప్రయాణికులంతా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు.
  • రైళ్లలో సీటింగ్‌ విధానం కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.
  • రైలు ప్ర యాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించే వి ధంగా చర్యలు తీసుకుంటున్నారు.
  • అలాగే, అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు గుంపులు గుంపులుగా తిరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పైగా వారికి అవగాహన కల్పిస్తున్నారు.
  • రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా క్యూ పద్ధతిని పాటించే విధంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చ ర్యలు తీసుకున్నారు.
  • రైళ్లలో గాని, స్టేషన్లలో గాని, రైల్వే స్టేషన్‌ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
  • ఆ ప్రాంతాలన్ని ప్రతి రోజూ శానిటైజ్‌ చేస్తున్నారు.
  • రైల్వే స్టేషన్లకు చేరుకునే ప్రయాణికులు గాని, ఇతర వ్యక్తు లు ఎవ్వరైనా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడాన్ని నిషేధించారు.
  • ఉమ్మేసిన వారిపై రూ.500 జరిమానా విధిస్తున్నారు. మాస్కులు ధరించని వారిపైనా జరిమానాలు విధిస్తున్నట్ల ప్రకటించారు.
  • అందులో భాగంగా ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది సౌకర్యం సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు.
  • కొనసాగింపుగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతో పాటు తోడుగా వచ్చే వారి రద్దీని తగ్గించడంపైనా రైల్వే చర్యలు తీసుకుంది.
  • ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధరను రూ.50 పెంచింది.
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana