కల్తీ పెట్రోల్ పోయడంతో బైక్ పాడైందని బంక్ ముందు యువకుడి నిరసన

Wed,April 25, 2018 08:00 PM

young man protests at petrol bunk alleges bunk adulterating petrol in vanasthalipuram

హైదరాబాద్: కల్తీ పెట్రోల్ పోయడం వల్లనే తన బైక్ పాడైందని రాహుల్ అనే యువకుడు పెట్రోల్ బంక్ ముందు ఆందోళన వ్యక్తం చేశాడు. వనస్థలిపురంలోని పనామా వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్‌లో ఆ యువకుడు పెట్రోల్ కొట్టించుకున్నాడు. అయితే.. ఆ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడం వల్ల తన బైక్ పాడైందని.. పెట్రోల్‌లో కిరోసిన్, డీజిల్ కలిపి కల్తీ చేస్తున్నారని ఆ యువకుడు ఆరోపించాడు. బంక్ ముందు ఆందోళనకు దిగాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన వనస్థలిపురం పోలీసులు.. కల్తీ పెట్రోల్‌పై బంక్ సిబ్బందిని ప్రశ్నించారు. అయినప్పటికీ.. బంక్ సిబ్బంది సరిగా స్పందించడం లేదని.. అందుకే.. ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపాడు.

3149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles