ఫొటోలు తీసి... బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్ట్

Tue,December 18, 2018 11:02 AM

young man Arrested in harassing a girl

హైదరాబాద్ : దుస్తులు మార్చుకునే సమయంలో ఫొటోలు తీసి... బాలికను వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నల్గొండ జిల్లా అనుములా మండలం, వీర్లగడ్డ గ్రా మానికి చెందిన జటావత్ రామకృష్ణ ప్రైవేటు ఉద్యో గి. ఇతను నారాయణపురం మండలం , డాకు తండాలో జరిగిన బంధువుల వివాహానికి వెళ్లాడు. ఆ సందర్భంలో ఓ బాలిక దుస్తులు మార్చుకుంటుండగా ఫొటోలు తీశాడు. వాటిని అడ్డంపెట్టుకుని ఆ బాలిక ను లైంగికవాంచ తీర్చాలని వెంటపడ్డాడు. భయాందోళనకు గురైన బాలిక... ఓ రోజు రామకృష్ణ పిలువడంతో ఇబ్రహీంపట్నంలోని అతని గదికి వెళ్లింది. అతను.. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోల ను తీశాడు. దీనికి భయపడ్డ బాలిక అతన్ని ప్రతిఘటించింది. ఈ విషయం పై కోపం పెంచుకున్న రామకృష్ణ... బాలిక పేరు మీద ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి .. అందులో ఆమె ఫొటోలను పెట్టాడు. దీంతో బాధిత బాలిక కుటుం బ సభ్యులు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా తన లైంగికవాంచను తీర్చనందుకే ఆ విధంగా చేశానని ఒప్పుకున్నాడు. అతని మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

1829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles