ఉద్యోగం పోగొట్టిందనే అనుమానంతో...

Tue,October 30, 2018 08:28 AM

young man arrested in girlfriend harassment case at hyderabad

హైదరాబాద్ : స్నేహితురాలి కారణంగానే ఉద్యోగం పోయిందని భావించి ఆమెకు సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలను ఆమె భర్త, కుటుంబ సభ్యులకు పంపి వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ హరినాథ్ కథనం ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోనాల్ చౌహాన్ 2008లో వోడాఫోన్ సంస్థలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా చేరాడు. ఆ సమయంలోనే తోటి ఉద్యోగినితో అయిన పరిచయం సన్నిహితంగా మారింది. ఇద్దరు కలిసి సెల్ఫీలు దిగి, కలిసి తిరిగారు. అదే సంవత్సరంలో వొడాఫోన్ నుంచి భారత్ యాక్సా లైఫ్ సంస్థలో చేరాడు. తోటి ఉద్యోగినిని కూడా ఆ కంపెనీలో ఉద్యోగం పెట్టించాడు. ముంబయిలో పని చేస్తున్న సమయంలో బాధితురాలి ఫ్లాట్‌లోకి వెళ్లి ఆమె ల్యాప్‌టాప్, కంప్యూటర్లలో ఉన్న వ్యక్తి గత ఫొటోలు, వీడియోలను తీసుకున్నాడు.

నాలుగు నెలల కిందట సోనాల్ చౌహాన్ ఉద్యోగం పోయింది. దీంతో తన ఉద్యోగం పోవడానికి కారణం స్నేహితురాలేనని భావించి ఆమె మీద కోపం పెంచుకున్నాడు. ప్రస్తుతం బాధితురాలికి వివాహం జరిగి అమెరికాలో ఉంటుంది. నెల రోజుల నుంచి సోనాల్ చౌహాన్ బాధితురాలికి సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు, అశ్లీల మెసేజ్‌లను ఆమె భర్త, తల్లిదండ్రులకు పంపిస్తూ వేధిస్తున్నాడు. దీని పై బాధితురాలు ఇటీవల నగరానికి వచ్చి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోనాల్ చౌహాన్‌ను అరెస్ట్ చేశారు.

2190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles