4, 5 తేదీల్లో డ్యాన్సు మెళకువలపై వర్క్‌షాపు

Sat,July 28, 2018 07:51 AM

workshop on dance techniques on august 4 and 5

హైదరాబాద్ : సిరిమువ్వ, పాప్‌చిప్ డ్యాన్స్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5వ తేదీల్లో 2కే18 పేరుతో వెస్టన్ డ్యాన్స్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు సిరిమువ్వ ఆర్ట్ డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ మధు తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని సోలీడైర్ హోటల్‌లో ఈ శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ డ్యాన్సర్, మిసెస్ ఏసియా సుధాజైన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో మంది మంచి వెస్టన్‌డ్యాన్సు నిర్వాహాకులు, ఔత్సాహికులు ఉన్నారని, వారందరూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నప్పటికీ కొన్ని మెళకువలు రావడం లేదన్నారు. అలాంటి వారి కోసం ముంబై నుంచి బాలీవుడ్ హీరోల కొరియోగ్రాఫర్ పరేష్ ముఖ్యఅతిథిగా వచ్చి అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఆగస్టు 4, 5వ తేదీల్లో దిల్‌సుఖ్‌నగర్‌లో ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు, అలాగే సికింద్రాబాద్‌లోని పద్మాశాలి సెవా సమాజ్‌లో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు 8008292121, 7416101668 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో బాడీరాక్, రమేశ్, పాప్‌చిక్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

1000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles