సెంట్రల్ జోన్‌లో ఉమెన్ ఆన్ వీల్స్ ప్రారంభం

Thu,December 13, 2018 06:48 AM

Woman on wheels in Central zone

హైదరాబాద్: మహిళా సిబ్బందికి అన్ని విభాగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించడంలో హైదరాబాద్ పోలీసులు ముందున్నారని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని మహిళా సిబ్బందికి పెట్రోలింగ్ బాధ్యతలు అప్పగించడంలో భాగంగా ఉమెన్ ఆన్ వీల్స్ పేరుతో మహిళా సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయెల్ బైక్‌లను అందించారు. ఇందులో భాగంగా సెంట్రల్ జోన్‌లో మహిళా పోలీసు సిబ్బందితో నెక్లెస్‌రోడ్డులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీసీపీ విశ్వప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మహిళా పోలీసు సిబ్బంది, సాధారణ వేళల్లో బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ విధులు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది రెండు నెలల శిక్షణ పొందినట్లు వారు వివరించారు. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్, సంజీవయ్య పార్కు ప్రాంతాల్లో మహిళా సిబ్బంది బైక్‌పై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, షీ టీమ్స్ ఏసీపీ నర్మద, సీసీఎస్ అడ్మిన్ ఇన్స్‌పెక్టర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles