భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

Mon,August 19, 2019 06:35 AM

wife suicide after husband harassment in hyderabad

హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరేసుకొని మృతి చెందిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, రామగుండానికి చెందిన గుమ్మడి సుందర్ కుమార్తె ప్రవలిక(24)తో కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ పరిధి చెన్నారెడ్డినగర్‌కు చెందిన జి.కృష్ణతో డిసెంబర్ 16, 2018లో వివాహం జరిపించారు. గత కొంత కాలం తర్వాత భర్త కృష్ణ ప్రవలికను వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక ప్రవలిక ఈ నెల 18న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ప్రవలిక తండ్రి గుమ్మడి సుందర్ అల్లుడు కృష్ణ వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

4674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles