ఖైరతాబాద్ కాంగి'రేసు'లో ఎవరు..?

Sat,October 20, 2018 10:48 AM

who is in the race of khairatabad assembly from congress

హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఇంకా కొలిక్కిరాలేదు. పలువురు ఆశావాహులు టిక్కెట్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు జరుపుతుండగా ఆ పార్టీ అధిష్ఠానం మనస్సులో ఎవరున్నారో బహిర్గతం కావటం లేదు. మాజీ ఎమ్మెల్యే దివంగత పీజేఆర్ మరణాంతరం ఆ బాధ్యతలను అప్పటి కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తీసుకున్నారు. అనంతరం ఓ సారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్ల పాటు ఆయన పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇదే క్రమంలో ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిపోగా, ఆయన వెంట చాలా మంది సీనియర్ నేతలు వెళ్లిపోయారు. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజల నాడి తెలిసిన నేత కరువయ్యాడు.

ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
ఖైరతాబాద్ టికెట్‌ను అధిష్ఠానం ఖరారు చేయకపోవడంతో ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా మాజీ కార్పొరేటర్లు, పార్టీలో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎస్‌కే షరీఫ్, కృష్ణా యాదవ్ రేసు టికెట్‌పై ఆశ పెట్టుకున్నారు. ఇద్దరూ నేతలు కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవంతో ఉండటంతో పాటు మూడు దశాబ్దాలకు పైగా ఆ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ వెంట పనిచేసిన అనుభవం ఉంది. వీరితో పాటు మరో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ పర్యటించిన క్రమంలో పోటా పోటీగా ఆయన మెప్పు పొందేందుకు సదరు నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే అదిష్ఠానం మనస్సులో మాత్రం ఇతర జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఖైరతాబాద్‌ను ఖరారు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

1910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS