కేటీఆర్ పుట్టిన రోజున నీటి పొదుపు కార్యక్రమం

Sat,July 20, 2019 06:26 AM

water harvesting programme on KTR birth day

-ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మాణానికి శ్రీకారం
- ఫౌండేషన్ చైర్మన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా


హైదరాబాద్ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూలై 24న నీటి పొదుపు కార్యక్రమాలను ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 100 హార్వేస్టింగ్ పిట్స్‌ను సొంత నిధులతో నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నీటి విలువను తెలుసుకొని నీటిని ఒడిసిపట్టే ఏర్పాట్లు చేయకుంటే భవిష్యత్తు తరాలకు తీవ్ర ఇక్కట్లు కలుగుతాయని పేర్కొన్నారు. బోర్ల వద్దే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలను నిర్మాణం చేసుకోవాలని సూచించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా 24న నాగోలులో వాటర్ హార్వెస్టింగ్ పిట్ నిర్మాణం చేస్తామని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, నీటిని ఒడిసిపట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొత్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 ఇంకుడుగుంతలను నిర్మాణం చేస్తామని తెలిపారు.

723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles