రాజకీయాల నుంచి విరమణ తీసుకున్నా..కానీ,

Sun,February 3, 2019 07:16 PM

vp venkaiah naidu inaugurates yogaiah naidu  bhavan in vnr college

హైదరాబాద్‌: బాచుపల్లి వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో యోగయ్య నాయుడు భవనాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, సినీ నిర్మాత డి.సురేశ్‌ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన వినూత్న ప్రాజెక్టులను ఉపరాష్ట్రపతి ఆసక్తిగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి విరమణ తీసుకున్నా..కానీ, ప్రజాజీవితం నుంచి విశ్రాంతి తీసుకోలేదని అన్నారు. ఉపరాష్ట్రపతి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 68 యూనివర్సిటీలను సందర్శించా. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. దేశంలో 60శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగంలో గుణాత్మక మార్పులు రావాలి. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన రేటుతో పాటు మార్కెటింగ్‌ కల్పించాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కూడా ప్రోత్సహించాలి. దేశీయ కళను కాపాడుకోవాలి. ఈసారి 15 మంది రైతులకు పద్మ అవార్డులు ఇచ్చామని పేర్కొన్నారు.

ఇక్కడ విద్యార్థులు చేసే ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. రాష్ట్రంలో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం 600 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించామన్నారు. విద్యా రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.

4717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles