మధ్యాహ్నం 3 గంటల వరకు 56.17 శాతం పోలింగ్

Fri,December 7, 2018 04:01 PM

Voter turnout recorded till 3 PM in TelanganaElections2018 is 56.17%

హైదరాబాద్:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56.17శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరోవైపు రాజస్థాన్‌లో 3 గంటల వరకు 59.43శాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.

1604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles