నేడు, రేపు నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన

Thu,February 28, 2019 06:55 AM

vice president of india comes to hyderabad today

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ నగరంలో నేడు, రేపు పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా నగరంలో ఆయన పర్యటించే సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 10.15 నిమిషాలకు జుబ్లీహిల్స్ నుంచి దోమలగూడలోని ఏవీ కాలేజీకి వెళ్తారు. ఆయన వెళ్లే చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు, నాగార్జున సర్కిల్, తాజ్ కృష్ణ, కేసీపీ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, సాధురాం లేన్ మీదుగా కాలేజీకి చేరుకుంటారు. ఆ తరువాత అక్కడి నుంచి 12 గంటల సమయంలో తిరిగి జుబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకుంటారు. ఈ సమయంలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని వెల్లడించారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles