నేడు రాజేంద్రనగర్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్య

Thu,August 30, 2018 09:23 AM

Venkaiah naidu to comes to Rajendranagar Today

రాజేంద్రనగర్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు రాజేంద్రనగర్‌కు రానున్నారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్డీపీఆర్‌)లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రూరల్‌ ఇన్నోవేటర్స్‌ స్టార్టప్‌ కన్‌క్లేవ్‌ కార్యక్రమాన్నివెంకయ్య ప్రారంభిస్తారు. వెంకయ్యతోపాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని నిర్వాహకులు వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక యువకులు రూపొందిస్తున్న వివిధ రకాల పరికరాలకు విస్తృత ప్రచారం కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌ఐఆర్డీపీఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ డా.డబ్ల్యు.ఆర్‌.రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాలకు చెందిన 182 మంది వివిధ స్టాళ్లను ఏర్పాటు చేస్తారని వివరించారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్‌ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.

1558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles