సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం:హ‌రీష్‌రావు

Fri,April 19, 2019 09:19 PM

use of millets is essential for good health


వెంగళరావునగర్‌: ప్రజల్లో మారుతున్న జీవన విధానాలతో పాటు ఆహార అలవాట్లలో కూడా పెను మార్పులు వ‌చ్చాయ‌ని ఎమ్మెల్యే హ‌రీష్‌రావు తెలిపారు. ఆహారం విషయంలో ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌కు స్వస్తి పలికి మరలా పాత రోజుల్లో వాడే సిరిధాన్యాలను ప్రతి రోజూ మన ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు.

శుక్రవారం శ్రీనగర్‌కాలనీలోని కెన్స్‌ హోటల్‌లో యువ నేత, వ్యాపారవేత్త పెద్దల అంజిబాబు అద్వర్యంలో మార్కెట్‌లోకి ప్రవేశ‌పెట్టనున్న హెల్త్‌ అండ్‌ న్యూట్రీషన్‌ ఉత్పత్తులను హరీష్‌రావు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ దేశ్‌పతి శ్రీనివాస్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. వందేళ్ళ పూర్వం సిరిధాన్యాలనే ఆహారంగా తీసుకునే వారని, బియ్యాన్ని కేవలం శుభకార్యాల్లో మాత్రమే వాడేవారని అన్నారు. సిరిధాన్యాలను మరవడంతో పాటు మారిన ఆధునిక జీవనంలో త్వరగా రోగాల బారిన పడుతున్నారన్నారు. సిరిధాన్యాలను ప్రతి రోజూ మనం తినే ఆహారంలో తీసుకొవడంతో పాటు వ్యాయామం, యోగా చేస్తే రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి జీవనవిధానాన్ని దృష్టిలో ఉంచుకొని సిరిధాన్యాలతో తయారు చేసిన ఇన్‌స్టెంట్‌ ఫుడ్స్‌, స్నాక్స్‌ను మార్కెట్‌లోకి పెద్దల అంజిబాబు తీసుకురావడం హర్షించదగ్గ విషయమన్నారు. పెద్దల అంజిబాబు కుటుంబంతో తనకు చాలా ఏళ్ళుగా అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో వారి కుటుంబం పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. ఇప్పటి మార్కెట్‌లో సిరిధాన్యాలకు మంచి స్పందన‌ ఉందని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగాలని సీఎం ఓఎస్‌డీ దేశ్‌పతి శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో పలువురు న్యూట్రీషనిస్ట్‌, డాక్టర్లు పాల్గొన్నారు.

2800
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles