రైలుకిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Thu,November 1, 2018 07:50 AM

unknown person committed suicide by train

తెలుగుయూనివర్సిటీ : రైలు కిందపడి గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై దాస్యనాయక్ కథనం ప్రకారం...భరత్‌నగర్-బోరబండ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి (35040) మంగళవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మా ర్చురీకి తరలించారు. మృతిడి ఒంటిపై లైట్ బ్లూ రంగు ఫుల్ షర్టు, బ్లూ రంగు జీన్స్ ధరించి ఉన్నాడని, జేబులో ఇంటి తాళం చేవి ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే ఫోన్: 040-23202238, 9948539390లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.

1282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles