మెట్రోస్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Thu,November 8, 2018 10:51 AM

unknown man jumped from metro station for suicide

హైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మైత్రివనం మెట్రోస్టేషన్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మెట్రోస్టేషన్ మొదటి అంతస్తు నుంచి గుర్తు తెలియని వ్యక్తి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మంగళవారం కూడా ఓ మహిళ కుటుంబ కలహాలతో కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌ మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకింది. స్థానికులు ఆమెను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.

1967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles