గౌలిదొడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Mon,November 11, 2019 06:36 AM

హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌలిదొడ్డి గ్రామ సమీపంలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో వేపచెట్టుకు ఉరేసుకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతుండటంతో స్థానికులు గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయస్సు సుమారు 25 ఏండ్లు ఉండవచ్చని, అతని పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లూ కలర్ ఫుల్‌చొక్కా, జీన్స్ ప్యాంట్‌లు ధరించి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఉస్మానియాకు మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలకు ఫోన్ : 94910 30378, 94906 17127, 94906 17193 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles